Cannes: కేన్స్ ఫెస్టివల్స్‌లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- కేన్స్ ఫెస్టివల్స్‌లో రక్త సింధూరం
- మిస్ వెనిజులా 2025పై దాడి
- రక్తసిక్తంగా మారిన బ్యూటీ క్వీన్
- రక్తమోడుతున్న వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. మిస్ వెనిజులా 2025 ఆండ్రియా డెల్ వాల్‌పై సెలబ్రిటీ స్టైలిస్ట్ లగూనా దాడి చేశాడు. ఈ మేరకు ఆరోపిస్తూ సోషల్ మీడియాలో ఆండ్రియా డెల్ వాల్ షాకింగ్ వీడియో విడుదల చేసింది. వీడియోలో ఆమె ముఖం మొత్తం రక్తంతో కనిపించడంతో ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.
29 ఏళ్ల ఆండ్రియా డెల్ వాల్ మంగళవారం ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ఉన్న హోటల్ గదిలో ఈ దాడి జరిగినట్లు వెల్లడించింది. “చూడండి.. జియోవన్ని లగూనా నాకు ఇదే చేశాడు. నువ్వు నిజంగా ఎవరో ప్రపంచానికి తెలిసిపోయింది” అంటూ స్పానిష్‌లో వీడియోలో మాట్లాడింది. అనంతరం గది మొత్తం చిందరవందరగా మారిన దృశ్యాలను కూడా చూపించింది. హోటల్లో పెద్ద ఎత్తున అరుపులు, గొడవ శబ్దాలు వినిపించడంతో అతిథులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు విదేశీ మీడియా కథనాలు వెల్లడించాయి. పోలీసులు చేరుకునే సమయానికి జియోవన్ని లగూనా గదిలోనే ఉన్నట్లు సమాచారం. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ కోసం తరలించారు.
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
జియోవన్ని లగూనా లాటిన్ అమెరికాలో ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్‌గా గుర్తింపు పొందాడు. 2023 నుంచి మిస్ యూనివర్స్ కొలంబియా క్రియేటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. పలువురు బ్యూటీ క్వీన్స్, సెలబ్రిటీలతో అతనికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత ఆండ్రియా డెల్ వాల్‌కు వైద్య చికిత్స అందించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సమాచారం. అయితే గొడవకు అసలు కారణమేంటన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఫ్రెంచ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
తాజావార్తలు
-
BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
-
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
-
Shubman Gill: అదే మా కొంపముంచింది.. ప్రపంచ కప్‌కు ముందు ఇలా ఆడితే..!
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!