Site icon NTV Telugu

పువ్వు అందంగా ఉంద‌ని వాస‌న చూసి…

పువ్వులు అన్నీ అందంగా ఉంటాయి.  అందంగా ఉన్న‌యాని వాటిని ముట్టుకున్నా, వాస‌న‌చూసినా కొన్ని ఎఫెక్ట్ చూపుతుంటాయి.  అలాంటి వాటిల్లో ఏంజిల్స్ ట్రంపెట్స్ ఒక‌టి.  చూడ‌టానికి ప‌సుపురంగులో, పొడ‌వుగా ఉమ్మెత్త పువ్వుల్లా ఆక‌ర్షణీయంగా ఉంటాయి.  అయితే, వీటిల్లో స్కోపోల‌మైన్ అనే భ‌యంక‌ర‌మైన, ప్ర‌మాద‌క‌ర‌మైన డ్ర‌గ్ ఉంటుంది.  వీటిని ముట్టుకున్నా, వాస‌న చూసినా ఒక్కోసారి ప్రాణాలు కోల్పోవ‌ల‌సి వ‌స్తుంది.  కెన‌డాలో ఎక్కువగా ఈ పువ్వులు క‌నిపిస్తుంటాయి.  

Read: దెయ్యంలా మారి కొరియోగ్రాఫర్ ను భయపెట్టేసిన హీరోయిన్…!

టోరంటోకు చెందిన సింగ్ ర‌ఫెలా వేమ్యాన్ త‌న స్నేహితురాలితో క‌లిసి బ‌ర్త్‌డే పార్టీకి వెళ్తుండ‌గా మ‌ధ్య‌లో ఏంజిల్స్ ట్రంపెట్స్ పువ్వులు క‌నిపించాయి.  చూసేందుకు అందంగా ఉండ‌టంతో పువ్వుల‌ను కోసి వాస‌న చూశారు.  ఆ త‌రువాత పార్టీకి వెళ్లిపోయారు. పార్టీకి వెళ్లిన వీరికి తెలియ‌కుండా మ‌త్తు ఆవ‌హించింది.  ఏం జ‌రిగిందో తెలిసేలోపే డాక్ట‌ర్ రావ‌డం, ఇంజెక్ష‌న్ చేయ‌డం వంటివి జరిగిపోయాయి.  వైద్యులు సకాలంలో ఇంజెక్ష‌న్ ఇవ్వ‌డంతో ర‌ఫెలా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది.  ఈ న్యూస్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

Exit mobile version