అగ్ర రాజ్యం అమెరికాలో మరో కీలక ముందడుగు పడింది. భారతీయులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ దీపావళి భారతదేశంలోనే కాకుండా ఆయా దేశాల్లో కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇందుకు కాలిఫోర్నియా గవర్నర్ తీసుకున్న నిర్ణయమే ఉదాహరణగా నిలుస్తోంది.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీ-కోల్‌కతా హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. 4 రోజులుగా నిలిచిపోయిన వందలాది వాహనాలు
తాజాగా దీపావళి రోజున సెలవుగా ప్రకటిస్తూ కాలిఫోర్నియా గవర్నర్ ఉత్తర్వు జారీ చేశారు. దీపావళి పండగను అమెరికాలో సెలవు రోజుగా ప్రకటించాలని ప్రతిపాదిస్తూ గతంలో ఓ బిల్లు తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని కాలిఫోర్నియా స్టేల్ అసెంబ్లీ ఆమోదించింది. అసెంబ్లీ సభ్యుడు ఆష్ కల్రా ప్రవేశపెట్టిన బిల్లుపై సంతకం చేసినట్లు గవర్నర్ గవిన్ న్యూసమ్ మంగళవారం వెల్లడించారు.
ఇది కూడా చదవండి: Jaipur: జైపూర్-అజ్మీర్ హైవేపై ఘోర ప్రమాదం.. భారీ శబ్దాలతో పేలిన గ్యాస్ సిలిండర్లు
ఆష్ కల్రా మట్లాడుతూ.. కాలిఫోర్నియాలో అత్యధికంగా భారతీయ అమెరికన్లు ఉన్నారని… ఈ పండుగ రోజును అధికారికంగా సెలవు రోజుగా ప్రకటిస్తే లక్షలాది మంది కాలిఫోర్నియా ప్రజల్లో సంతోషాలు నింపుతుందని పేర్కొన్నారు. సద్భావన, శాంతి, ఉమ్మడి భావన అనే సందేశాలతో సమాజాన్ని ఈ పండగ ఒకచోట చేర్చుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే పెన్సిల్వేనియా, న్యూయార్క్‌లు ఇప్పటికే దీపావళికి అధికారికంగా సెలవు ఇస్తున్నాయి. తాజాగా మూడో రాష్ట్రంగా కాలిఫోర్నియా చేరింది. ఇది భారతీయ అమెరికన్లకు ఒక మైలురాయిగా చెప్పొచ్చు.
జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే బిల్లుపై సంతకం చేసినట్లు మంగళవారం గవర్నర్ గవిన్ న్యూసమ్ పేర్కొన్నారు. ఇది ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీ కళాశాలలు దీపావళి రోజున అధికారికంగా మూసివేయనున్నారు. దీపావళిని సిక్కులు, జైనులు, బౌద్ధులు కూడా జరుపుకుంటారని చట్టం పేర్కొంది.
కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీలోని శాన్ జోస్ నగరంలో భారతీయ అమెరికన్ జనాభా గణనీయంగా పెరిగింది. 2025 ప్యూ సర్వే ప్రకారం.. దేశంలోని 4.9 మిలియన్ల భారతీయ జనాభాలో 960,000 మంది లేదా 20 శాతం కాలిఫోర్నియాలో నివసిస్తున్నట్లు తేలింది.
