Bullet Train: ఒడిశాలో రైలు ప్రమాదం జరిగి సుమారు 275 మందికిపైగా మరణించారు. 1000 మంది వరకు గాయాలపాలయ్యారు. ఈ నేపథ్యంలో రైల్వేల భద్రత, నిర్వహణ, ఆధునికీకరణపై మరోసారి చర్చ ముందుకొచ్చింది. 170 ఏళ్ల చరిత్ర కలిగిన భారత రైల్వేల్లో ఎన్నో మార్పులు సంభవించినప్పటికీ ఇంకా ఇతర దేశాల్లో మాదిరిగా మన దేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే బుల్లెట్ ట్రయిన్లు అందుబాటులోకి రాలేదనే విమర్శలున్నాయి. పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైల్వే శాఖ.. ఆ స్థాయిలో సదుపాయాలు కల్పించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జపాన్ లోని బుల్లెట్ రైళ్ల గురించి చర్చ జరుగుతోంది. 60 ఏళ్ల క్రితం పట్టాలు ఎక్కిన బుల్లెట్ రైళ్లు ఇప్పటివరకు ప్రమాదానికి గురి కాకుండా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
Read also: Bhatti Vikramarka : కేసీఆర్ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి
జపాన్ అనగానే మనకు బుల్లెట్ రైలు గుర్తుకు వస్తుంది. అధిక వేగంగా ప్రయాణించినప్పటికీ ఈ బుల్లెట్ రైళ్లు ప్రమాదానికి గురికావు. జపాన్‌లో ఇప్పటివరకు సాంకేతిక వైఫల్యాలతో ఒక్క బుల్లెట్ రైలు కూడా ప్రమాదానికి గురికాకపోవడం గమనించదగ్గ విషయం. గత 60 ఏళ్లలో ఈ బుల్లెట్ ట్రైన్ల వల్ల ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు. జపాన్‌లో ఈ బుల్లెట్ రైళ్లను 1964 అక్టోబరు 1న టోక్యో ఒలింపిక్స్‌కు 9 రోజుల ముందు ప్రారంభించారు. తొలిసారి టోక్యో నుంచి ఒసాకాకు ప్రయాణాలు సాగించాయి. ప్రస్తుతం జపాన్‌లో 2,700 కిలోమీటర్లకు పైగా ఈ బుల్లెట్ ట్రైన్లు విస్తరించాయి. బుల్లెట్ రైలును జపాన్‌లో షింకాన్‌సెన్ అని అంటారు. జపనీస్ భాషలో షింకాన్‌సెన్ అంటే కొత్త ట్రంక్‌లైన్ అని అర్థం. ప్రారంభించినపుడు ఈ బుల్లెట్ రైలు గంటకు 210 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేది. ప్రస్తుతం ఈ బుల్లెట్ రైళ్లు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పట్టాలపై పరుగులు పెడుతున్నాయి.
Read also: Adipurush: హనుమంతుడి కోసం ఒక సీటు.. వావ్.. ఏం నమ్మకం ఇచ్చారయ్యా
జపాన్‌లో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. భూకంపాలను కూడా తట్టుకునేలా ఇంజనీర్లు ఈ బుల్లెట్ రైళ్లను తయారు చేశారు. భూకంప కేంద్రం నుంచి ప్రకంపనలు ప్రారంభం కాగానే.. ఈ బుల్లెట్ రైలు వ్యవస్థ తక్షణం స్పందిస్తుంది. వెంటనే రైళ్లకు కరెంటును ఆపేస్తుంది. దీంతో బుల్లెట్ రైలులో ఉండే టెక్నాలజీ రైలును నిలిపివేస్తుంది. దీంతో రైలు దెబ్బతినకుండా.. ప్రయాణికుల ప్రాణాలు పోకుండా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ బుల్లెట్ రైళ్లో అత్యాధునిక సెన్సార్లు ఉంటాయి. పట్టాల ఉష్ణోగ్రత, వర్షాలు పడటాన్ని పరిశీలిస్తుంది. రైలుకు వ్యతిరేకంగా గాలి సెకనుకు 30 మీటర్ల కంటే ఎక్కువ వేగంతో వీస్తే.. ఆటోమేటిక్‌గా బుల్లెట్ రైలు ఆగిపోతుంది. అంత అత్యాధునిక టెక్నాలజీ ఈ బుల్లెట్ ట్రయిన్లు పనిచేస్తాయి. డ్రైవర్ మొత్తం ట్రైన్‌ను కంట్రోల్ చేసేలా వ్యవస్థలు ఉంటాయి. ఈ బుల్లెట్ రైళ్లలో ఉన్న అత్యాధునిక టెక్నాలజీ మూలంగా ఎదురెదురుగా రెండు రైళ్లు వచ్చినా ఢీకొట్టకుండా ఉండేలా స్పెషల్ హైస్పీడ్ ట్రాక్‌లను నిర్మించారు. ఈ బుల్లెట్ రైళ్లు ప్రయాణించే మార్గాల్లో ఎలాంటి లెవల్ క్రాసింగ్‌లు ఉండకుండా జాగ్రత్త పడ్డారు.