Site icon NTV Telugu

తాలిబ‌న్లు మారిపోయారా… బ్రిటీష్ ఆర్మీ చీఫ్ కీల‌క వ్యాఖ్య‌లు…

ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం తాలిబ‌న్ల గురించే మాట్లాడుకుంటున్నారు.  1970 ద‌శ‌కం నుంచి మొజాహిదీన్లు ఆఫ్ఘ‌న్‌లో అధికారం కోసం పోరాటం చేస్తున్నారు.  ఆ తరువాత మొజాహిదీన్‌ల నుంచి తాలిబ‌న్ సంస్థ ఆవిర్భ‌వించింది.  1996లో తాలిబ‌న్‌లు ఆఫ్ఘ‌న్‌లో అధికారంలోకి వ‌చ్చారు.  నాలుగేళ్ల వారి పాల‌న‌లో ఆ దేశంలోని ప్ర‌జ‌లు ఎన్ని న‌ర‌క‌యాత‌న‌లు అనుభ‌వించారో చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.  2001 త‌రువాత తాలిబ‌న్లను యూఎస్ సైన్యం త‌రిమికొట్టి ప్ర‌జాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు.  అయితే, ఎప్పుడు మ‌రోసారి తాలిబ‌న్లు ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించుకున్నారు.  మ‌రోసారి చీక‌టిరాజ్యం ఏలుబ‌డిలో ఆఫ్ఘ‌నిస్తాన్ వెళ్ల‌బోతుంద‌ని ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు.  దేశం విడిచి వెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే, తాలిబ‌న్ల గురించి బ్రిటీష్ ఆర్మీ చీఫ్ స‌ర్ నిక్ కార్టర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  1970 ద‌శ‌కం నాటి తాలిబ‌న్ల‌కు వీరికి తేడా ఉందేమో, ఒక‌సారి వారికి అవ‌కాశం ఇచ్చి చూస్తే అస‌లు విష‌యం తెలుస్తుంద‌ని, మంచి ప‌రిపాల‌న‌ను అందిస్తారేమో అని అన్నారు.  ఆర్మీ చీఫ్ వ్యాఖ్య‌లను ఆ దేశ మాజీ సైనికాధికారులు త‌ప్పుప‌డుతున్నారు.  తాలిబ‌న్లలో మార్పు వ‌స్తుంద‌ని, వారు మారార‌ని, సుప‌రిపాల‌న అందిస్తార‌ని అనుకోవ‌డం మూర్ఖ‌త్వం అవుతంద‌ని,  పైకి మంచి పాల‌న అందిస్తామ‌ని చెబుతున్నా, ఇత‌ర దేశాల సైనికులు పూర్తిగా ఖాళీ చేసి వెళ్లిన త‌రువాత‌, ప్ర‌పంచం దృష్టి మ‌ర‌లిన త‌రువాత వారి అరాచ‌కాలు మొద‌ల‌వుతాయ‌ని మాజీ సైనికాధికారులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.  

Read: తాలిబ‌న్ల‌కు ముచ్చెమ‌ట‌లు పట్టించిన ఆఫ్ఘ‌న్ మహిళా మేయర్‌… కానీ…

Exit mobile version