Site icon NTV Telugu

USAకు ప్రారంభమైన బ్రిటిష్‌ ఏయిర్‌ వేస్‌ విమానాలు

కోవిడ్‌ మహమ్మారి వల్ల 20 నెలల కిందట విధించిన అంతర్జాతీయ విమానయాన రాకపోకలకు విధించిన నిషేధాన్ని యూఎస్‌ఎ ప్రభు త్వం ఎత్తి వేసింది. దీంతో లండన్‌ నుంచి బ్రిటిష్ ఎయిర్‌వేస్ ఫ్లైట్, వర్జిన్ అట్లాంటిక్ ఒకటి సోమవారం లండన్‌లోని హీత్రూ విమానా శ్రయం నుంచి న్యూయార్క్‌లోని జాన్‌ఎఫ్‌ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్ర యానికి ఈ ఫ్లైట్‌లు బయలు దేరి వెళ్లాయి. కోవిడ్-19కి వ్యతిరేకంగా పూర్తిగా టీకాలు వేసిన విదేశీ సందర్శకులకు యునైటెడ్ స్టేట్స్ తన వాయు సరిహద్దులను తిరిగి తెరిచింది. సోమవారం ఉదయం హీత్రూ విమానాశ్రయంలోని సమాంతర రన్‌వేల నుండి యుఎస్‌లోని న్యూ యార్క్ నగరంలోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జా తీయ విమానాశ్రయానికి రెండు విమానాలు ఒకే సమయంలో బయలుదేరాయి.

మార్చి 2020లో, యుఎస్‌లోని డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం యూరోపియన్ యూనియన్, బ్రిటన్, చైనా, ఇండియా బ్రెజిల్‌తో సహా ప్రపంచంలోని పెద్ద ప్రాంతాల నుండి వచ్చే ప్రయా ణికులు వచ్చేఉ మార్గాలను యూఎస్ మూసివేసింది. మెక్సికో, కెనడా నుండి ఓవర్‌ల్యాండ్ సందర్శకులను కూడా నిషేధించారు. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ నిషేధం ఎత్తివేసింది యూఎస్‌ ప్రభుత్వం. అయితే అమెరికాలోకి ప్రయాణికులను నేరుగా అనుమతించరు. ప్రయాణికులు దేశంలోకి ప్రవేశించిన మూడు రోజులలోపు పూర్తిగా టీకాలు వేసుకోవాలి. దీంతో పాటు కోవిడ్‌ -19 నెగిటివ్‌ అని రుజువు చేసుకోవాల్సి ఉంటుంది.

Exit mobile version