Site icon NTV Telugu

Bridge Collapses: రిబ్బన్‌ కట్ చేసింది.. వంతెన కూలింది.. వీడియో వైరల్‌

Bridge Collapses

Bridge Collapses

Bridge Collapses in Congo During Inauguration: ఈఊరిలో వానలు, వంతెన లేక ఇబ్బంది పడుతున్న జనం. కానీ నీటిలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదంటు ఆవేదన వ్యక్తం చేస్తుంటే స్పందించిన అధికారలు వంతెన నిర్మించే పనిలో పడ్డారు. ఊరు దాటేందుకు వంతెనను శ్రమించి ఎట్టకేలకు సద్దం చేశారు. వర్షాలతో అతలాకుతలం అవుతున్న ఆఊరికి చివరకు వంతెన షురూ కానుందని ఊరిలో సంబరాలు చేసుకున్నారు. ఆనందంతో తబ్బిబ్బయ్యారు. కానీ వారి ఆనందం ఆకాస్త సమయం వరకే పరిమితమైంది. ఆబ్రిడ్జి ప్రారంభోత్సవంలోనే అపశృతి చోటుచేసుకుంది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

అయితే.. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ప్రారంభోత్సవానికి సిద్దమైన ఓ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం చేస్తుండగానే కుప్ప కూలింది. వానాకాలం కావడంతో.. స్థానికులు నదిని దాటేందుకు ఒకచిన్న బ్రిడ్జ్ ను నిర్మించారు. ఈనేపథ్యంలో.. ఈ బ్రిడ్జ్ ను ప్రారంభించేందుకు ఒక మహిళా ప్రభుత్వ అధికారి చీఫ్ గెస్ట్ గా అక్కడి అధికారులు స్వాగతించారు. ఆ..అధికారి అలా రిబ్బన్ కట్ చేసిందో లేదో బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. అయితే.. బ్రిడ్జ్ కిందికి పడిపోతున్న సమయంలో అలర్ట్‌ యిన అధికారి ముందుకు దూకడంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆమెను సురక్షితంగా కిందకు దించారు. ఆ..తరువాత సెక్యూరిటీ గార్డులు వెంటనే ఆమెను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే.. ప్రారంభోత్సవం రోజునే ఇలా బ్రిడ్జ్ కూలిపోవడంతో నిర్మాణ నాణ్యత, అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాగు ఉంటుంది మరి అధికారుల పరిస్థితి. అందుకే మాకు ఈఖరమ్మ అంటూ విమర్శలు వెల్లవెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Exit mobile version