NTV Telugu Site icon

Bizarre Love Story: ఇదేం విడ్డూరంరా బాబు.. ఫోన్ దొంగలించిన వ్యక్తితోనే ప్రేమలో పడ్డ యువతి

Woman Love With Thief

Woman Love With Thief

Bizarre Love Story: ఎవరైనా మన వస్తువుల్ని దొంగలిస్తే మనం ఏం చేస్తాం? అప్పటికప్పుడే ఆ దొంగని పట్టుకొని నాలుగు తగిలించడమో, పోలీసులకు ఫిర్యాదు చేయడమో చేస్తాం. కానీ.. ఓ యువతి మాత్రం అందుకు భిన్నంగా, తన ఫోన్ దొంగలించిన వ్యక్తితోనే ప్రేమలో పడింది. ఈ విడ్డూరం బ్రెజిల్‌లో చోటు చేసుకుంది. ఈ ‘దొంగ ప్రేమ’కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో తాము ఎలా కలుసుకున్నాం, తమ మధ్య ఎలా ప్రేమ చిగురించిందనే విషయాలను ఆ జంట పంచుకుంది.

Cemetery Marriage: ఇదేందయ్యా ఇది, ఇది నేన్ చూడలే.. స్మశానంలో పెళ్లా?

ఆ జంట తెలిపిన వివరాల ప్రకారం.. బ్రెజిల్‌కి చెందిన ఇమాన్యులా ఒక రోజు వీధిలో నడుచుకుంటూ వెళ్తోంది. ఆ వీధిలో జాకర్ అనే దొంగ ఆమె చేతిలో ఫోన్ ఉండటాన్ని గమనించాడు. ఇంకేముంది.. దాన్ని దొంగలించాలని నిర్ణయించుకున్నాడు. ఇమాన్యులా ముందు నడుచుకుంటూ వెళ్తుండగా, వెనుక నుంచి జాకర్ దూసుకొచ్చి ఆమె చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని, అక్కడి నుంచి తారాజువ్వలా పారిపోయాడు. ‘దొంగ దొంగ’ అంటూ ఇమాన్యులా కొంతదూరం వరకు వెంబడించింది కానీ, అతని వాయువేగాన్ని అందుకోలేకపోయింది. దీంతో చేసేదేమీ లేక, ఫోన్ పోతే పోయిందిలే అనుకుని ఇమాన్యులా సైలెంట్ అయిపోయింది. అయితే.. ఫోన్ దొంగలించిన తర్వాత జాకర్ అందులో ఇమాన్యులా ఫోటో చూశాడు. అంతే, దెబ్బకు ఫిదా అయిపోయాడు. ‘ఈ అమ్మాయి ఏంటి ఇంతందంగా ఉంది’ అంటూ ఆమెపై మనసు పారేసుకున్నాడు.

Union Minister Video Call: వీడియో కాల్‌లో పోర్న్.. కేంద్రమంత్రికే బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్

‘ఇంత అందమైన అమ్మాయి ఫోన్‌ని దొంగలించానా?’ అని బాధపడిన జాకర్, తన మనసు మార్చుకొని ఇమాన్యులాని కలిసి, ఆమెకి ఫోన్ తిరిగిచ్చేశాడు. స్వయంగా దొంగే వచ్చి తనకు ఫోన్ తిరిగి ఇవ్వడం.. ఇమాన్యులాకు నచ్చింది. అతని గుణం నచ్చి, స్నేహం చేసింది. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది. అలా వీళ్లు ఒక్కటయ్యారు. తన జీవితంలో అమ్మాయి లేకపోవడం వల్ల దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కున్నానని, కానీ ఫోన్ దొంగలించాక ఇమాన్యులా ఫోటో చూసి ఫిదా అయ్యానని, ఇలాంటి అమ్మాయిని రోజూ చూడాలని అనుకున్నానని జాకర్ తెలిపాడు. అలాగే ఆమె ఫోన్ దొంగలించినందుకు బాధపడ్డానని పేర్కొన్నాడు. ఫోన్ దొంగలించాల్సిన తాను, ఆమె మనసు దోచుకున్నానని చెప్పుకొచ్చాడు. వీళ్లిద్దరు రెండేళ్ల నుంచి డేటింగ్ చేస్తున్నారు.

Show comments