Union Minister Video Call: వీడియో కాల్‌లో పోర్న్.. కేంద్రమంత్రికే బెదిరింపులు.. ఇద్దరు అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2 Men Arrested For Trying To Blackmail Union Minister By Playing Nude On Video Call: సాంకేతికతక పెరిగినప్పటి నుంచి సైబర్ నేరాలు కూడా అమాంతం పెరిగిపోయాయి. ఏవేవో లింక్‌లు పంపి మొబైల్ ఫోన్‌లను హ్యాక్ చేయడమో, వీడియో కాల్స్ ద్వారా బుట్టలో పడేసి న్యూడ్ వీడియో కాల్స్ రికార్డ్ చేయడం లాంటివి.. కొందరు దుండగులు పాల్పడుతున్నారు. ఈమధ్య కాలంలో అయితే.. న్యూడ్ వీడియో కాల్ వ్యవహారాలు మరీ పెచ్చుమీరిపోయాయి. తొలుత అమ్మాయిలుగా పరిచయం చేసుకోవడం.. పోర్న్ వీడియోల ద్వారా అవతలి వ్యక్తుల్ని టెంప్ట్ చేసి, దాన్ని రికార్డ్ చేసి బ్లాక్‌మెయిల్‌కి పాల్పడటం వంటివి చేస్తున్నారు. అదే పంథాలోనే.. ఇద్దరు కేటుగాళ్లు ఏకంగా కేంద్రమంత్రినే బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించారు. వీడియో కాల్‌లో పోర్న్ వీడియో ప్లే చేసి, ఆయన్ను బెదిరించాలని ట్రై చేశారు. కానీ.. వారి ప్లాన్ బెడిసికొట్టి, అడ్డంగా దొరికిపోయారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Manipur Violence: మణిపూర్‌లో ఆగని హింస.. మయన్మార్ సరిహద్దులోని మోరేలో 30 ఇళ్లకు నిప్పు
Also Read
- Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
ఈ ఏడాది జూన్ నెలలో ఆ కేంద్రమంత్రికి వాట్సాప్‌లో ఓ కొత్త నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. బహుశా తెలిసిన వారు ఎవరైనా కొత్త నంబర్ నుంచి చేసి ఉంటారని భావించి, కేంద్రమంత్రి ఆ వీడియో కాల్‌ని లిఫ్ట్ చేశారు. ఆయన ఆ కాల్ లిఫ్ట్ చేయడమే ఆలస్యం, వెంటనే పోర్న్ వీడియో ప్లే అవ్వడం మొదలైంది. అసలేం జరుగుతుందోనని కేంద్రమంత్రికి అర్థమయ్యేలోపే, ఆ వీడియో కాల్ కట్ అయ్యింది. కొన్ని నిమిషాల తర్వాత కేంద్రమంత్రికి మరో నంబర్ కాల్ వచ్చింది. తమ డిమాండ్స్ పూర్తి చేయకపోతే, ఆ వీడియో క్లిప్‌ని వెంటనే సోషల్ మీడియాలో విడుదల చేస్తానని ఓ వ్యక్తి ఆ కాల్‌లో బెదిరించాడు. దీంతో ఖంగుతిన్న ఆ కేంద్రమంత్రి.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు రంగంలోకి దిగి, కేంద్రమంత్రికి ఫోన్ కాల్ వచ్చిన నంబర్ ఆధారంగా విచారణ చేయడం మొదలుపెట్టారు. ఎట్టకేలకు జులై నెలలో మహ్మద్ వకీల్, మహ్మద్ సాహిబ్ అనే ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసుని విచారిస్తున్న క్రైమ్ బ్రాంచ్ విభాగం.. ఇందులో ప్రమేయం ఉన్న మరికొందరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Srinivasa Setu Flyover: శ్రీనివాస సేతు ఫ్లైఓవర్ నిర్మాణంలో ప్రమాదం.. ఇద్దరు మృతి
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!