దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్… ఇనుప నరాలు ఉన్న వంద మందిని ఇవ్వండి దేశాన్ని మార్చి చూపిస్తానని అన్నారు వివేకానందుడు. గుండె ధైర్యం, కండ బలం ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే అనుకున్నది సాధిస్తారు. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కండబలం అంటే మగాళ్లకు ఉంటుందని అనుకుంటాం. కానీ, ఈ కాలంలో మగాళ్లకు ఆడవాళ్లు ఏ మాత్రం తీసిపోవడంలేదు. ప్రతి విషయంలో వారితో పోటీపడుతున్నారు. బ్రెజిల్ దేశానికి చెందిన అలెసాండ్రా అల్విస్ అనే మహిళ ఓ పెద్ద సాహసమే చేసింది. 12 కిలోల బరువైన పుచ్చకాయను తన తోడల మధ్య ఉంచి సెకను వ్యవధిలో పగలగొట్టి ఔరా అనిపించింది. అలెసాండ్రాకు బ్రెజిల్ దేశంలో ఫ్యాన్స్ ఎక్కువ. ఆమె దేహదారుడ్యానికి ఫిదా అవుతుంటారు. అల్విన్ తన 12 వ ఏట నుంచే ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకున్నది. మోడలింగ్ రంగంలోకి వెళ్లిన తరువాత బాడీ బిల్డింగ్ రంగంవైపు అడుగులు వేసింది. ఆమెను సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలో అవుతుంటారు.
బాబోయ్… 12 కేజీల పుచ్చకాయను ఎలా నలిపేసిందో చూశారా?
