కరోనా మహమ్మారిపై పోరాటం చేసేందుకు భారత్ బయోటెక్ ఫార్మాసంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్‌కు ఇప్పటికే భారత్‌లో అనుమతులు లభించాయి. వేగంగా వ్యాక్సిన్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, యూరోపియన్ దేశాలు కోవాగ్జిన్‌ను వ్యాక్సిన్‌గా గుర్తించకపోవడంతో అక్కడి దేశాలకు వ్యాక్సిన్‌ను ఎగుమతి చేయలేకపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే, భారత్ వ్యాక్సిన్‌పై ఉన్న నమ్మకంతో బ్రెజిల్ కోవాగ్జిన్ ను కోనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. 20 కోట్ల డోసులు కొనుగోలు చేసేందుకు 324 మిలియన్ డాలర్ల ఒప్పందం జరిగింది.
Read: ఓటిటిలో “స్టేట్ అఫ్ సీజ్ : టెంపుల్ అటాక్”
అయితే, ఈ వ్యాక్సిన్‌కు బ్రెజిల్‌లో అనుమతులు లభించలేదు. అనుమతులు రాకముందే వ్యాక్సిన్ కోనుగోలుకు ఒప్పందం చేసుకోవడంతో అధ్యక్షుడు బోల్సోనారోపై విమర్శలు వెల్లువెత్తాయి. వేలాదిమంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అధ్యక్షుడిపై ఒత్తిడి పెరగడంతో కోవాగ్జిన్ కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు బ్రెజిల్ ప్రకటించింది. ఇది కోవాగ్జిన్‌కు కొంత ఎదురుదెబ్బ అని చెప్పాలి. అయితే, అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ కోవాగ్జిన్ సమర్ధతపై ప్రసంశలు కురిపించింది. ఈ వ్యాక్సిన్ అల్ఫా, డెల్టా వేరియంట్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
