Site icon NTV Telugu

Couple Crime: బాలుడ్ని దత్తత తీసుకున్నారు.. చిత్రహింసలకు గురి చేసి చంపేశారు.. అందుకోసమే!

Couple Killed Son

Couple Killed Son

Boy Died After His Brain Was Obliterated By Couple Who Adopted Him Then Beat Him: తమకు పిల్లలు లేరన్న ఉద్దేశంతో ఓ జంట ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నారు. మొదట్లో అతని ఆలనాపాలనా బాగానే చూసుకున్నారు. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు కానీ.. వాళ్లిద్దరు కలిసి ఆ చిన్నారిని చిత్రహింసలకు గురి చేయడం మొదలుపెట్టారు. తమ కోపాన్నంతా ఆ అబ్బాయిపై చూపిస్తూ.. విచక్షణారహితంగా కొట్టారు. పాపం.. ఆ చిన్నారి ఆ దెబ్బలకు తాళలేక, తుదిశ్వాస విడిచాడు. ఆ వివరాల్లోకి వెళ్తే.. డెల్మాంట్‌కు చెందిన లారెన్, జాకబ్ మలోబెర్టి అనే దంపతులు పెన్సిల్వేనియాకు చెందిన లాండన్ అనే 5 ఏళ్ల బాలుడిని దత్తత తీసుకున్నారు. ఈ దంపతులు జనవరి 30వ తేదీన తీవ్ర గాయాలతో స్పృహ కోల్పోయిన స్థితిలో ఉన్న లాండన్‌ను ఆసుపత్రికి తీసుకొచ్చారు. తమ బాబు ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉందని, అతడ్ని ఎలాగైనా కాపాడాలని ఆ జంట కోరింది.

Disha Patani : టెంప్టింగ్ పోజులతో రెచ్చగొడుతున్న హాట్ బ్యూటీ…

లాండన్‌కు వెంటనే ట్రీట్‌మెంట్ చేయడం మొదలుపెట్టిన వైద్యులకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిశాయి. బాలుడి తల, మెడపై తీవ్ర గాయాలు ఉండటాన్ని గమనించారు. అలాగే.. అతడు తీవ్ర నొప్పితో బాధపడుతుండటాన్ని గుర్తించారు. ఆ గాయాలు చూసి.. అతడ్ని తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారని పసిగట్టారు. అతనికి మెరుగైన చికిత్స అందించి, కాపాడ్డానికి ప్రయత్నించారు కానీ.. చివరికి ఫిబ్రవరి 7వ తేదీన లాండన్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పోస్టుమార్టం రిపోర్ట్‌లో అతడ్ని చిత్రహింసలకు గురి చేశారన్న విషయం తేలడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. అతని పెంపుడు తల్లి లారెన్, జాకబ్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి కేసుని విచారించిన వెస్ట్‌మోర్‌ల్యాండ్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ.. వాళ్లిద్దరు కలిసి లాండన్‌ను రేయించబవళ్లు టార్చర్ పెట్టి, అత్యంత కిరాతకంగా హత్య చేశారని వెల్లడించింది. మరో ట్విస్ట్ ఏమిటంటే.. లాండన్‌కు ట్రీట్‌మెంట్ అందుతున్న సమయంలో అతని పెంపుడు తల్లిదండ్రులు గో ఫండ్ ద్వారా నిధుల్ని సేకరించారు. వారికి 5 వేల డాలర్లకు పైగా నిధులు వచ్చినట్టు తెలిసింది.

Australia: కామాంధుడు.. 91 మంది బాలికలపై అత్యాచారం..1600లైగింక వేధింపుల కేసులు

అటు.. డాక్టర్లు పిల్లాడి దయనీయ పరిస్థితి గురించి వివరించారు. తల్లిదండ్రులు కొట్టిన దెబ్బలకు.. ఆ ఐదేళ్ల చిన్నారికి మెదడులో రక్తస్రావం జరిగిందన్నారు. ఆ చిన్నారిని ఆసుపత్రికి తీసుకురావడానికి ఒక రోజంతా వేచి చూశారన్నారు. పిల్లాడి శరీరంపై గతంలో అయిన గాయాలతో పాటు కొత్త గాయాలు ఉండటాన్ని గమనించామని.. శారీరక వేధింపుల వల్లే ఆ గాయాలయ్యాయని చెప్పారు. ఆ బాలుడు కనీసం నిలబడలేకపోయాడని.. తినడానికి, తాగడానికి వీలుకాని పరిస్థితిలో దుర్భర స్థితిని ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. బాలుడు స్పృహ కోల్పోవడంతో అతని అవయవాల పనితీరు మరింతగా బలహీనపడిందని వైద్యులు తెలిపారు. కాగా.. లాండన్ పట్ల అతని పెంపుడు తండ్రి జాకబ్ ఎంతో ద్వేషం ప్రదర్శించాడని, చేతికి దొరికిన వస్తువులతో కొట్టేవాడని, తమకు ఏడుపులు బయటిదాకా వినిపించేవని స్థానికులు వెల్లడించారు.

Exit mobile version