Site icon NTV Telugu

Painting: పెన్నుందిక‌దా అని గీసేశాడు… ఆ త‌రువాత‌…

బోర్ కొడితే సినిమాలు చూడాలి లేదంటే ప‌క్క‌న ఉన్న‌వాళ్ల‌తో మాట్లాడాలి. అంతేగాని, బోర్ కొట్టింద‌ని దొరికిన వాటిపై పిచ్చిగీత‌లు గీస్తే వారి రాత మారిపోతుంది. ఆ రాతను తిరిగి మార్చుకోవాలి అంటే ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చుచేయాల్సి వ‌స్తుంది. ర‌ష్యాలోని 1930 కాలంనాటి అరుదైన మూడు ముఖాలు లేని చిత్రాలు చాలా ఫేమ‌స్‌. త్రీ ఫిగ‌ర్స్‌గా పేరుపొందిన ఈ మూడు చిత్రాల‌ను యోల్ట్సిన్ లోని ది వ‌ర‌ల్డ్ యాజ్ నాన్ ఆబ్జెక్టివిటీ, ది బ‌ర్త్ ఆఫ్ ఏ న్యూ ఆర్ట్స్ ఎగ్జిబిష‌న్ లో ఉంచారు. అయితే, ఇందులో ప‌నిచేసే ఓ సెక్యూరిటీ గార్డ్ బోరు కొట్టింద‌ని చెప్పి బాల్ పాయింట్ పెన్నుతో ఆ ముఖాల‌కు గుండ్ర‌ని క‌ళ్ల‌ను గీశాడు.

Read: Beijing Olympics: ఆ మంచు కోసం చైనా ఎంత ఖ‌ర్చు చేసిందో తెలుసా…!!?

పాత‌కాలం నాటి పెయింటింగ్స్ కావ‌డంతో పెన్నుతో గీయ‌డం వ‌ల‌న ఆ చిత్రాలు ర‌ఫ్ అయ్యాయి. పెయింటింగ్స్ పాడైపోయినందుకు నిర్వ‌హకులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇక‌, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ను స‌ద‌రు సెక్యూరిటీ సంస్థ తొల‌గించింది. చిత్రాల‌ను అయిన న‌ష్టాన్ని భ‌రించేందుకు ముందుకు వ‌చ్చింది. సుమారు న‌ష్టం 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. అయితే, 1930 కాలం నాటి ఈ చిత్రాల‌కు రూ. 7.47 కోట్లతో బీమా చేయించార‌ని స‌మాచారం.

Exit mobile version