
బంగ్లాదేశ్ లో ఓ ఘోర పడవ ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ లోని పద్మ నదిలో నిత్యం వందలాది మంది పడవలపై ప్రయాణం చేస్తుంటారు. ఇసుక రవాణా అధికంగా ఈ నది గుండా జరుగుతుంది. అయితే, పద్మ నదిలో 30 మంది ప్రయాణికులతో ప్రయాణం చేస్తున్న నౌకను ఇసుక నౌక ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. ఐదుగురిని ప్రయాణికులను పోలీసులు రక్షించారు. అయితే, ఇంకా కొంతమంది నదిలో కొట్టుకు పోయారని, వారికోసం గాలిస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పద్మ నదిలో జరిగిన ప్రమాదం పట్ల అక్కడి ప్రభుత్వం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.