Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
- పాకిస్తాన్ సైనికులపై బీఎల్ఎఫ్ మహిళా యూనిట్ దాడి..
- కరీమా బలూచ్ పేరుతో మహిళా యూనిట్ ఏర్పాటు..
- 9 మంది పాకిస్తాన్ సైనికుల్ని హతమార్చినట్లు ప్రకటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balochistan: పాకిస్తాన్ సైనికులకు బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF) చుక్కలు చూపిస్తోంది. తాజాగా బీఎల్ఏ మహిళ మిలిటెంట్ విభాగం కరీమా ఆర్మ్డ్ అసాల్ట్ డివిజన్ (KAAD) దాడి చేసింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను బీఎల్ఎఫ్ విడుదల చేసింది. ఈ దాడిలో 9 మంది పాకిస్తానీ సైనికులు హతమైనట్లు ప్రకటించింది.
సెప్టెంబర్ 22న బలూచిస్తాన్‌లోని తుర్బత్ సమీపంలోని జుసాక్ ప్రాంతంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్) రోడ్డుపై వెళ్తున్న పాక్ సైనిక కాన్వాయ్‌పై దాడి చేసింది. మూడు వాహనాల్లో వెళ్తున్న క్విక్ రెస్పాన్స్ ఫోర్స్(QRF) కాన్వాయ్‌పై మహిళా మిలిటెంట్లు దాడి చేసినట్లు బీఎల్ఎఫ్ చెప్పింది. ఈ దాడిలో ఆరుగురు పాక్ సైనికులు హతమయ్యారని, సెప్టెంబర్ 25న కలాత్ జిల్లా మంగుచర్ ప్రాంతంలో మరో ముగ్గురు పాకిస్తాన్ సైనికుల్ని చంపినట్లు బీఎల్ఎఫ్ ప్రకటించింది. బలూచ్ స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త కరీమా బలూచ్ పేరుతో బీఎల్ఎఫ్ మహిళా యూనిట్‌ను ఏర్పాటు చేసింది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో సైనిక దుస్తులు ధరించిన మహిళలు కాన్వాయ్‌పై అటాక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read
- Pakistan: బంగ్లాదేశ్‌కు పాకిస్తాన్ షాక్.. రష్యా ‘‘న్యూక్లియర్ ఫ్యూయల్’’ విమానానికి నిరాకరణ..
- Pentagon Cyberattack: అమెరికా సైనికుల డేటాబేస్‌లోకి హ్యాకర్లు.. 9 నెలల పాటు తిష్ట.. 27.6 లక్షల మంది డేటా లీక్!
- H-1B Visa: భారతీయులకు గట్టి షాక్.. H-1B వీసా నిబంధనలపై తగ్గేదేలే అంటున్న అమెరికా..
- US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
مانیٹرنگ :
بلوچستان لبریشن فرنٹ (BLF) نے اپنے میڈیا سیل ’’آشوب‘‘ کے ذریعے اپنے نو تشکیل شدہ ’’کریمہ آرمڈ اسالٹ ڈویژن‘‘ (KAAD) کی ایک ویڈیو جاری کی ہے۔
ویڈیو میں تربت کے علاقے جوسک میں سی پیک روڈ پر کیو آر ایف قافلے پر حملے اور قلات کے علاقے منگچر میں ناکہ بندی اور گاڑیوں کے… pic.twitter.com/m1nb3kxHdI
— Subain Baloch (@subain_bluch) September 28, 2026
తాజావార్తలు
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
-
Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
-
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!