తెలిసింది గోరంత… తెలయంది కొండంత.. అంతకంటే ఇంకా ఎక్కవే… అంతరిక్షం గురించి తెలుసుకోవాలని, అంతరిక్షంలో ప్రయాణం చేయాలని అందరికీ ఉంటుంది. రష్యా వ్యోమగామి యూరిగగారిన్ ఎప్పుడేతే అంతరిక్షంలోకి అడుగుపెట్టాడో అప్పటి నుంచి మరింత ఆసక్తి నెలకొన్నది. పరిశోధనలు వేగంగా సాగుతున్నాయి. స్పేస్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ఎంటరయ్యాక ఒక్కసారిగా పోటీ మొదలైంది. వర్జిన్ గెలక్టిక్, బ్లూఆరిజిన్, స్పేస్ ఎక్స్ వంటి సంస్థలు అంతరిక్ష పరిశోధన రంగంలో దూసుకెళ్తున్నాయి. వీరి పరిశోధన మొత్తం అంతరిక్ష యాత్ర చుట్టూనే జరుగుతున్నాయి.
Read: అఫిషియల్ : “రాక్షసుడు” సీక్వెల్ వచ్చేస్తోంది !
విమానాల్లో ప్రయాణం చేసిన విధంగానే, అంతరిక్ష విమానంలో కూడా ప్రయాణం చేయాలని ఎంతో మందికి ఉంటుంది. అలాంటి వారి కోసం వర్జిన్ గెలక్టిక్‌లు, బ్లూఆరిజిన్ లు స్పేస్ షిప్‌లను తయారు చేస్తున్నాయి. జులై 11 వ తేదీన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ కు చెందిన స్పేస్ షిప్ విజయవంతంగా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చింది. 90 నిమిషాల పాటు ఈ యాత్ర కొనసాగింది. యాత్ర విజయవంతం కావడంతో రాబోయో రోజుల్లో స్పేస్ యాత్రను కమర్షియల్‌గా ప్రారంభించేందుకు వర్జిన్ గెలాక్టిక్ సన్నాహాలు చేస్తున్నది. మరోవైపు అటు ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ తన బ్లూఆరిజిన్ సంస్థకు చెందిన న్యూషెపర్డ్ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. ఈ యాత్ర విజయవంతమైతే ఈ సంస్థకూడా కమర్షియల్‌గా యాత్రలను ప్రారంభించే అవకాశం ఉన్నది. అటు ఎలన్ మస్క్ కూడా త్వరలోనే స్పేస్ ఎక్స్ ద్వారా యాత్రలు చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
