అఫిషియల్ : “రాక్షసుడు” సీక్వెల్ వచ్చేస్తోంది !

“రాక్షసుడు” సీక్వెల్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన సైకో థ్రిల్లర్ మూవీ “రాక్షసుడు” బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళ హిట్ మూవీ “రాట్చసన్”కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం కమర్షియల్ గానూ, నటన పరంగానూ శ్రీనివాస్ కెరీర్ లో మర్చిపోలేని చిత్రంగా మిగిలింది. రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ థ్రిల్లర్ మూవీ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కొనేరు సత్యనారాయణ క్రైమ్ థ్రిల్లర్‌ను నిర్మించారు. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని ముందుగానే ప్రకటించారు. అన్నట్టుగానే తాజాగా సీక్వెల్ కు సంబంధించిన అధికారిక ప్రకటనను నేడు అనౌన్స్ చేశారు.

Read Also : “కార్తికేయ-2″కు ఆసక్తికర టైటిల్ ?

“రాక్షసుడు 2” పేరుతో ఉన్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఓ బిగ్ స్టార్ ఈ రీమేక్ లో హీరోగా నటించనున్నాడని ప్రకటించారు. దీంతో ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపించే అవకాశం లేదని అర్థమవుతోంది. ఇక ఈ సీక్వెల్ ను కూడా రమేష్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించనున్నారు. గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. మిగతా వివరాలను అతి త్వరలో ప్రకటించనున్నారు. మరి ఈ చిత్రంలో హీరోగా నటించబోయేది ఎవరో చూడాలి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-