Site icon NTV Telugu

అగ్రరాజ్యంలో ఎగరనున్న‌ త్రివ‌ర్ణ పతాకం… 75 ఏళ్లు పూరైన సంద‌ర్భంగా…

2021 ఆగ‌స్టు 15తో ఇండియాకు స్వాతంత్య్రం వ‌చ్చి 75 ఏళ్లు పూర్త‌వుతాయి.  ఈ సంద‌ర్బంగా దేశంలో పెద్ద ఎత్తున సంబ‌రాలు నిర్వ‌హించేందుకు కేంద్రం స‌న్నాహాలు చేస్తున్న‌ది.  మ‌న‌దేశంతో పాటుగా ఇత‌ర దేశాల్లో కూడా పెద్ద ఎత్తున భార‌త స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ప్ర‌తి ఏడాది అమెరికాలోని న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వ‌ద్ద జాతీయ జెండాను ఎగ‌ర‌వేస్తారు.  అయితే, 75 వ స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌ల్లో భాగంగా ఈ ఏడాది టైమ్ స్క్వేర్ లో అతిపెద్ద జెండాను ఎగ‌ర‌వేయ‌నున్నారు.  ఆరు అడుగుల పొడ‌వు, ప‌ది అడుగుల వెడ‌ల్పుతో కూడిన జాతీయ జెండాను ఎగ‌ర‌వేయ‌బోతున్నారు.  25 అడుగులున్న జెండా క‌ర్ర‌పై జాతీయ ప‌తాకం ఎగ‌ర‌బోతున్న‌ది.  అలానే టైమ్‌స్క్వేర్‌లోని బిల్ బోర్డుపై కూడా జాతీయ జెండాను 24 గంట‌ల పాటు ప్ర‌ద‌ర్శంచ‌నున్నారు.  అదేవిధంగా ప్ర‌ఖ్యాత ఎంఫైర్ భ‌వ‌నం త్రివ‌ర్ణం రంగుల్లో మెర‌వ‌బోతున్న‌ది. న్యూయార్క్‌లోని టైమ్‌స్క్వేర్‌లో వివిధ ర‌కాల సాంస్కృతిక కార్యక్ర‌మాలు నిర్వ‌హించబోతున్నారు.  

Read: సినీ ఇండస్ట్రీకి దెబ్బ… మళ్ళీ థియేటర్లు బంద్ !

Exit mobile version