NTV Telugu Site icon

Joe Biden: జో బైడెన్‌కి ఏమైంది, జీ-7 కోసం వెళ్లి వింత ప్రవర్తన.. వీడియో వైరల్..

Joe Biden

Joe Biden

Joe Biden: ఇటలీ వేదిక జీ-7 సమ్మిట్ జరుగుతోంది. ఆ దేశంలోని అపులియా ఇందుకు వేదిక కాబోతోంది. ఇప్పటికే సభ్యదేశాలైన అమెరికా, యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, కెనడాల దేశాధినేతలు ఇటలీ చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ వీరిందరిని సాధారంగా ఆహ్వానించారు. మరోవైపు మెలోనీ ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఆహ్వానం పంపారు. నిన్న మోడీ ఇటలీ బయలుదేరారు.

ఇదిలా ఉంటే, ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయింది. ఫోటోగ్రాఫ్ కోసం సభ్యదేశాల దేశాధినేతలు ఫోజ్ ఇచ్చే సమయంలో వారి నుంచి దూరంగా వెళ్లిన బైడెన్ అభివాదం చేయడం వీడియోలో కనిపించింది. బైడెన్ వేరే వైపు వెళ్లి థంప్సప్ చూపించడం కనిపిస్తోంది. అయితే, అటువైపు ఎవరూ ఉండటం కనిపించలేదు. ఆ తర్వాత ఇటలీ ప్రధాని జార్జియా మెలోని బైడెన్ వద్దకు వచ్చి చెప్పడంతో ఇతర దేశాధినేతలతో కలిసి ఫోటోకు ఫోజ్ ఇవ్వడం చూడొచ్చు.

Read Also: Kuwait Fire Accident: కువైట్ వెళ్లేందుకు కేంద్రం అనుమతించలేదు.. కేరళ మంత్రి ఆరోపణలు..

ఇటీవల బైడెన్‌ని ప్రతిపక్ష రిపబ్లిక్ పార్టీ తీవ్రంగా ట్రోల్ చేసింది. వైట్‌హౌజ్‌లో సంగీత ప్రదర్శన అయినపోన తర్వాత దాదాపు ఒక నిమిషం పాటు కదలకుండా ఉండిపోవడంపై ఎగతాళి చేసింది. ఇది జరిగిన తర్వాత ప్రస్తుతం ఇటలీలో మరో ఘటన చోటు చేసుకుంది. జోబైడెన్ ఇలా తడబడటం ఇదే తొలిసారి కాదు. ఫిబ్రవరిలో, అధ్యక్షుడు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ పేరును మాజీ నాయకుడు ఫ్రాంకోయిస్ మిత్రాండ్‌‌గా పిలికారు. అతను మరణించి దాదాపుగా 30 ఏళ్లు అయింది. మరో సందర్భంలో వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌ని ప్రెసిడెంట్‌గా సంబోధించాడు.