బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసిన విద్యార్థి సంఘాలను తాత్కాలిక ప్రభుత్వాధినేత ముహమ్మద్ యూనస్ ప్రశంసలతో ముంచెత్తారు. ఎలాంటి సందేహం లేదు… విద్యార్థుల నేతృత్వంలోని విప్లవం కారణంగా హసీనా ప్రభుత్వం కుప్పకూలిందని ఆదివారం రాత్రి విద్యార్థులతో సమావేశం అనంతరం యూనస్ విలేకరులతో అన్నారు.
విద్యార్థులతో ఆదివారం యూనస్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశాను. మీ పోరాటాన్ని గౌరవిస్తున్నానని.. అలాగే మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పారు. మీరు చేసినది పూర్తిగా అసమానమైనదని కొనియాడారు. తాత్కాలిక బాధ్యతలు చేపట్టని కోరినందుకు అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ అధిపతితో సహా ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారుల రాజీనామాలు చట్టబద్ధమేనని యూనస్ నొక్కిచెప్పారు.
విద్యార్థి నిరసనకారులలో ఇద్దరు.. నహిద్ ఇస్లాం మరియు ఆసిఫ్ మహమూద్.. యూనస్‌తో ప్రమాణం చేసిన 16 మంది సభ్యుల సలహా మండలిలో ఉన్నారు. 84 ఏళ్ల యూనస్ మైక్రోఫైనాన్స్‌లో చేసిన కృషికి మరియు సమాజ అభివృద్ధికి కృషి చేసే గ్రామీణ బ్యాంకును స్థాపించినందుకు 2006 నోబెల్ శాంతి బహుమతిని గెలుచుకున్నారు.
ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మధ్యంతర ప్రభుత్వం నుంచి సోమవారం పిలుపు వచ్చింది. బంగ్లాదేశ్‌కు తిరిగి రావాలని సందేశం పంపించారు. అయితే ప్రజలు ఆగ్రహానికి గురయ్యేలా ఎలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేసింది.
బంగ్లాదేశ్‌లో అల్లర్ల తర్వాత పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా భారత్‌కు వచ్చి తలదాచుకుంటున్నారు. ఇక్కడ నుంచి ఇతర దేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. యూకేలో ఉండాలని రెడీ అయ్యారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో పెండింగ్‌లో పడింది. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం.. తిరిగి దేశానికి రావాలని ఆహ్వానం పంపింది.
కోటా ఉద్యమంపై పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. దీంతో నిరసనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పరిస్థితులు చేదాటిపోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి కట్టుబట్టలతో భారత్‌కు వచ్చేశారు. అయితే ఇక్కడ నుంచి యూకేకు వెళ్లాలని ప్రయత్నం చేశారు. కానీ యూకే ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఆమె భారత్‌లోనే బస కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే షేక్ హసీనా రాజీనామా తర్వాత నోబెల్ గ్రహీత యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే తాత్కాలిక ప్రభుత్వం ఆహ్వానంపై షేక్ హసీనా ఎలా స్పందిస్తారో చూడాలి. కొద్దిరోజులు భారత్‌లోనే ఉంటారా? లేకుంటే ఇంకెక్కడికైనా వెళ్లారా? అన్నది వేచి చూడాలి.