Site icon NTV Telugu

Humaira Himu: బంగ్లాదేశ్ నటి హుమైరా హియు అనుమానాస్పద మృతి

Humaira Himu

Humaira Himu

Humaira Himu: బంగ్లాదేశ్‌లో ప్రముఖ నటి హుమైరా హిము(37) మరణించారు. మంగళవారం ఆమె మరణించినట్లు తెలుస్తోంది. ఉన్నట్లుండి హుమైరా ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే రాజధాని ఢాకాలోని ఉత్తరా మోడ్రన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఇదిలా ఉంటే కేవలం 37 ఏళ్ల వయసులోనే ఆమె మరణించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె మెడపై గాయం ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను విచారించేందుకు ఆస్పత్రికి పోలీసులు చేరుకునే సమయంలో, అంతసేపు హుమైరాతో ఉన్న స్నేహితుడు అక్కడి నుంచి పరారవ్వడం అనుమానాలను మరింగా పెంచుతోంది. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. హుమైరా చనిపోవడంతో బంగ్లా ఫిలిం ఇండస్ట్రీతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, ఫ్యాన్స్ షాక్ లో ఉన్నారు.

Read Also: Himanta Biswa Sarma: “మియా ముస్లింల” ఓట్లు మాకు అవసరం లేదు.. అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు..

అయితే హుమైనా ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇద్దరి మధ్య గొడవతో ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులు వచ్చిన తర్వాత నటి మృతికి స్పష్టమైన కారణాలు తెలుస్తాయని, ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

హుమైరా హిము 2006లో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అనేక బంగ్లాదేశీ సీరియల్స్ లో నటించింది. ‘ఛాయాబితి’ టీవీ సిరీస్ నుంచి ఫేమస్ అయింది. ఆమె “బారి బారి సారీ సారీ”, “హౌస్‌ఫుల్” మరియు “గుల్షన్ అవెన్యూ”తో సహా పలు టీవీ సిరీస్‌లలో కూడా కనిపించింది. మోర్షెదుల్ ఇస్లాం దర్శకత్వం వహించిన తన తొలి చిత్రం “అమర్ బోంధు రాషెడ్”లో ఆమె పాత్రకు విస్తృతమైన గుర్తింపు వచ్చింది.

Exit mobile version