Site icon NTV Telugu

Shahjahan Bhuiyan: 26 మందిని ఉరి తీసిన తలారి.. ఒకరి “చివరి కోరిక” మాత్రం గుర్తుంచుకున్నాడు..

Hangman

Hangman

Shahjahan Bhuiyan: షాజహాన్ భుయాన్(74) బంగ్లాదేశ్ లో పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఏకంగా 26 మంది దోషులను, యుద్ధ నేరస్తునలు ఉరితీశాడు. తాజాగా ఆయన జైలు నుంచి విడుదలయ్యాడు. దోపిడి, హత్య నేరాలకు గానూ దాదాపుగా 42 ఏళ్ల జైలు శిక్ష పడింది. మూడు దశాబ్ధాలు జైలులో శిక్ష అనుభవించిన భూయాన్ తాజాగా ఆదివారం విడుదయ్యాడు. ‘ద హాంగ్ మాన్’గా పిలుచుకునే భూయాన్ కు 2001లో జైలు అధికారులు ఉరితీసే ఉద్యోగం ‘తలారి’గా నియమించారు.

బంగ్లాదేశ్ ప్రభుత్వం అతను అమలు చేసిన ప్రతీ ఉరిశిక్షకు రెండు నెలల చొప్పున జైలు శిక్షను తగ్గించింది. దీంతో నాలుగు ఏళ్ల నాలుగు నెలలు శిక్ష తగ్గింది. జైలులో సత్ప్రవర్తన కారణంగా, భూయాన్ కు సుమారుగా 10 ఏళ్ల శిక్ష రద్దు అయింది. ఇతను తలారిగా పనిచేస్తున్న సమయంలో బంగ్లాదేశ్ జాతిపిత అయిన బంగబంధు షేక్ ముజిబుర్ రెహమన్ హంతకులను కూడా ఉరిశిక్ష అమలు చేశాడు. దీంతో ఆయన మీద మీడియా దృష్టి ఎక్కువైంది.

Read Also: Chandrayaan-3: చంద్రయాన్-3 ప్రయోగానికి శరవేగంగా ఏర్పాట్లు.. మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు ఇస్రో సన్నద్ధం..!

జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడాడు. ‘‘నేను ప్రతి ఉరిని అమలు చేస్తున్నప్పుడు భావోద్వేగానికి గురవుతాను. నేను కాకపోతే దీన్ని మరొకరు చేస్తారు. నేను ధైర్యంగా ఉన్నాను, అందుకే జైలు అధికారులు నాకు ఈ పని అప్పగించారు’’ అని అన్నారు. ఆయన అమలు చేసిన ఉరిశిక్షల్లో ఒక్కరిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేదని చెప్పాడు. అందుకు కారణం ఆ ఖైదీ చివరి కోరికే. మునీర్ అనే దోషి తన చివరి కోరిగా సిగరేట్ కావాలని అడిగాడు. అందుకే అతను గుర్తుండిపోయాడని చెప్పాడు.

భుయాన్ కు శిక్షలో భాగంగా 10,000 టాకా జరిమానా విధించామని, అతని పేదరికం కారణంగా జైలు అధికారులే ఈ మొత్తాన్ని చెల్లించారని ఢాకా సెంట్రల్ జైలు జైలర్ మహబుబుల్ ఇస్లాం తెలిపారు. నార్సింగిలోని ఇచాఖలి గ్రామానికి చెందిన భూయాన్ తనకు ఒక సోదరి, మేనల్లుడు ఉన్నాడని చెప్పాడు. జైలుకు వచ్చిన తర్వాత ఇన్నేళ్లలో నేను ఎవరిని సంప్రదించలేదని చెప్పాడు. జైలులో తనకు పరిచయమైన స్నేహితుడి ఇంటికి వెళ్తా అని చెప్పారు. నాకు ఉద్యోగం లేదు, నివసించడానికి స్థలాన్ని కేటాయించాల్సింది బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరాడు.

Exit mobile version