Site icon NTV Telugu

క్వారంటైన్ టైం అక్క‌డ 10 రోజుల‌కు కుదింపు..

క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉన్నా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా రోజువారి కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌ట్టింది.. ఇక‌, కేసుల సంఖ్య‌, పాజిటివిటీ రేటును బ‌ట్టి.. ఆయా దేశాలు విదేశీ ప్ర‌యాణికుల‌పై ఆంక్ష‌లు ఎత్తివేయ‌డం, క్వారంటైన్ టైం త‌గ్గించ‌డం లాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.. తాజాగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. బంగ్లాదేశ్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీస్ (డీజీహెచ్ఎస్‌).. అక్క‌డి ప్రస్తుత ఇన్ఫెక్షన్ రేటును ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని.. కొన్ని స‌డ‌లింపులు ఇచ్చింది.. అందులోభాగంగా.. క్వారంటైన్ కాలాన్ని తగ్గించింది… బంగ్లాదేశ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు క్వారంటైన్ స‌మ‌యం 14 రోజులుగా ఉంది.. దానిని ఇప్పుడు 10 రోజులకు కుదిస్తూ నిర్ణ‌యం తీసుకుంది..

Read Also: ట్విట్ట‌ర్‌పై ఏపీ హైకోర్టు సీరియ‌స్‌.. వ్యాపారం మూసుకోవాల్సి వ‌స్తుంది..!

డీజీహెచ్ఎస్ ప్రతినిధి ప్రొఫెసర్ డాక్టర్ నజ్ముల్ ఇస్లాం మాట్లాడుతూ.. జనవరి 30వ తేదీ వ‌ర‌కు ఉన్న పరిస్థితిని వివ‌రిస్తూ .. కరోనా పాజిటివ్ గా తేలితే.. 10 రోజుల ఐసోలేషన్ లో ఉండాల్సి వ‌స్తుంద‌ని.. ఒకసారి జ్వరం మరియు ఇతర లక్షణాలు క‌న‌బ‌డ‌కుండా పోతే.. పాజిటివ్‌గా తేలిన వ్య‌క్తులు 10 రోజుల తర్వాత తిరిగి పనికి వెళ్ల‌వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు.. ఇక‌, ఇప్ప‌టి వ‌ర‌కు కోవిడ్ నుంచి కోలుకున్న త‌ర్వాత తిరిగి విధుల్లో చేరాలంటే ఆర్టీ పీసీఆర్ టెస్ట్‌లో నెగిటివ్‌ సర్టిఫికేట్ తప్పనిసరిగా స‌మ‌ర్పించాల్స ఉండ‌గా.. ఆ ఆదేశాల‌ను కూడా నిలిపిస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.

Exit mobile version