NTV Telugu Site icon

Bangladesh: అదానీ విద్యుత్ ఒప్పందాలను సమీక్షించనున్న బంగ్లాదేశ్..

Bangladesh

Bangladesh

Bangladesh: అదానీకి వరసగా షాక్‌లు ఎదురవుతున్నాయి. విద్యుత్ ఒప్పందాల్లో అధికారులకు లంచాలు ఇచ్చాడని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. అయితే, అదానీ గ్రూప్ ఈ ఆరోపణల్ని ఖండించింది. ఈ ఆరోపణలు రావడంతో కెన్యా తమ దేశంలో అదానీ చేపడుతున్న కీలక ప్రాజెక్టుల్ని రద్దు చేసింది. ఇదిలా ఉంటే, తాజాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం షేక్ హసీనా ప్రధానిగా ఉన్న సమయంలో అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను సమీక్షించాలని అనుకుంటోంది. దీనిపై ఒక దర్యాప్తు సంస్థని ఏర్పాటు చేయాలని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం సిఫారసు చేసింది.

Read Also: Virat Kohli Century: టెస్టుల్లో 492 రోజుల తర్వాత సెంచరీ చేసి రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ

“2009 నుండి 2024 వరకు షేక్ హసీనా నిరంకుశ పాలనలో సంతకం చేసిన ప్రధాన విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలను సమీక్షించడానికి ఒక ప్రఖ్యాత చట్టపరమైన మరియు దర్యాప్తు ఏజెన్సీని నియమించాలని విద్యుత్, ఇంధనం మరియు ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖపై జాతీయ సమీక్ష కమిటీ సిఫార్సు చేసింది” అని ఒక అధికారి ప్రకటించారు. అదానీకి చెందిన 1234.4 MWల గొడ్డ పవర్ ప్లాంట్ నుంచి బంగ్లాదేశ్‌కి విద్యుత్ సరఫరా అవుతోంది. అదానీతో సహా మొత్తం 7 విద్యుత్ ఒప్పందాలను బంగ్లాదేశ్ సమీక్షించనుంది. ఇందులో ఒకటి చైనా నిర్మించిన విద్యుత్ ప్లాంట్ ఉంది. మిగతా వాటిలో బంగ్లాదేశ్ బిజినెస్ గ్రూపుకు చెందిన వారివి.