NTV Telugu Site icon

Bangladesh: పాఠ్యపుస్తకాల్లో బంగ్లా స్వాతంత్య్ర చరిత్ర సవరణలు.. యూనస్‌ సర్కార్ మాస్టర్ ప్లాన్!

Haseena

Haseena

Bangladesh: బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా కుటుంబ చరిత్రను కనుమరుగు చేసేందుకు తాతాల్కిక అధినేత మహమ్మద్‌ యూనస్‌ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆ దేశ పాఠ్యపుస్తకాల్లో బంగబంధు ముజిబుర్‌ రహ్మాన్‌ యొక్క ప్రాధాన్యం తగ్గించేలా అనేక సవరణలు చేశారు. 1971 బంగ్లా లిబరేషన్‌ వార్‌ సందర్భంగా స్వాతంత్ర్య ప్రకటన తొలిసారిగా జియావుర్‌ రహ్మాన్ చేసినట్లు మార్చేశారు. కానీ, గతంలో ఈ ప్రకటన షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ చేసినట్లుగా ఉండేది.. అలాగే, టెక్స్ బుక్స్ లో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తుంది. వీటిని జనవరి 1 నుంచి ప్రాథమిక, సెకండరీ పాఠశాలల్లో పంపిణీ చేస్తున్నట్లు సమాచారం.

Read Also: Introverts Day: ప్రతిదానికి మొహమాటపడిపోతున్నారా? వారిని ఏమంటారంటే..

కాగా, నేషనల్‌ కరికులమ్‌ టెక్స్ట్‌ బుక్‌ బోర్డ్‌ ప్రొఫెసర్‌ ఏకేఎం రియాజుల్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. కొత్త పుస్తకాలు 2025 కోసం రెడీ చేశాం.. 1971 మార్చి 26న జియావుర్‌ రహ్మాన్‌ స్వాతంత్య్ర ప్రకటన చేయగా.. మార్చి 27న ఆయనే ముజిబుర్‌ రెహ్మాన్‌ తరఫున కూడా ఇలాంటి ప్రకటనే వచ్చినట్లు మార్చినట్లు తెలిపాడు. ఫ్రీ బుక్స్ లో ఈ విషయాన్ని పొందుపర్చినట్లు వెల్లడించారు. ఇక, పరిశోధకుడు రఖల్‌ రహా దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించారన్నారు. గతంలో ముజిబుర్‌ రహ్మాన్‌ గురించి కొందరు ప్రజలపై బలవంతంగా చరిత్రను రుద్దారని చెప్పారు. పాక్‌ ఆర్మీ దగ్గర బందీగా ఉన్న సమయంలో షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ వైర్‌లెస్‌ సెట్‌ ద్వారా స్వాతంత్ర్య ప్రకటన చేసినట్లు ఎక్కడ ఆధారాలు లేవని తేల్చారు. అంతేకాదు, జాతిపితగా కూడా ముజిబుర్‌ రహ్మాన్‌ పేరును తొలగించేశారు.

Read Also: Mollywood : మలయాళంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం.. దర్శకుడు ఎవరంటే..?

అయితే, గతంలో 1 నుంచి 10వ తరగతి వరకు ఉన్న టెక్స్ట్‌ బుక్స్ లో పాలక ప్రభుత్వాన్ని బట్టి స్వాతంత్వ్ర ప్రకటన అంశంలో మార్పులు చేస్తున్నారు. అవామీ లీగ్‌ మద్దతుదారులు మాత్రం ముజిబుర్‌ రహ్మాన్‌ నాటి మేజర్‌ జియావుర్‌ రహ్మాన్‌తో కలిసి ఈ ప్రకటన చేసినట్లు గట్టిగా నమ్ముతున్నారు. ముజిబ్‌ ఆదేశాల మేరకు జియావుర్‌ ప్రకటన చదివినట్లు వాళ్లు చెప్తుంటారు. కానీ, బీఎన్‌పీ పార్టీ మాత్రం జియావురే స్వయంగా ఈ ప్రకటన చేసినట్లు తెలియజేస్తున్నారు.

Show comments