Site icon NTV Telugu

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ వ్యాపారి దారుణహత్య..

Bangladesh

Bangladesh

Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, హత్యలు ఆగడం లేదు. బంగ్లా సార్వత్రిక ఎన్నికలకు 48 గంటల మందు హిందూ వ్యాపారిని దారుణంగా హత్య చేశారు. మైమెన్‌సింగ్ జిల్లాలో సోమవారం రాత్రి ఆయన దుకాణంలోనే కత్తితో దాడి చేసి చంపినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని త్రిషల్ సబ్ డిస్ట్రిక్ట్‌లోని బోగర్ బజార్ లో బియ్యం వ్యాపారిగా, మెసర్స్ భాయ్ భాయ్ ఎంటర్‌ప్రైజ్ యజమాని సుషేన్ చంద్ర సర్కార్(62)గా గుర్తించారు. ఇతను ఇదే ప్రాంతంలోని సౌత్‌కాండ గ్రామంలో నివసిస్తున్నాడు.

Read Also: Insulin Resistance Food: ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే చాలు.. సహజంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్‌కు చెక్ పెట్టొచ్చు!

పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. ఈ సంఘటన రాత్రి 11.00 గంటల ప్రాంతంలో జరిగింది. గుర్తు తెలియని దుండగులు అతనిపై పదునైన ఆయుధాలతో దాడి చేసినప్పుడు సర్కార్ తన దుకాణం లోపలే ఉన్నాడు. హత్య తర్వాత దుండగులు షటర్ దించి, మృతదేహాన్ని అక్కడే వదిలి పారిపోయారు. త్రిశల్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్-ఇన్-ఛార్జ్ ముహమ్మద్ ఫిరోజ్ హుస్సేన్ ఈ సంఘటనను ధృవీకరించారు. దుండగులను పట్టుకోవడానికి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. హత్య వెనక కారణాలు ఇంకా నిర్ధారించలేదు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version