Shakib Al Hasan: 2024 జనవరిలో బంగ్లాదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ మేరకు అక్కడి ఎన్నికల సంఘం ఇటీవల డేట్స్ వెల్లడించింది. అయితే ప్రస్తుతం అక్కడ నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా విపక్షాలు ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా అక్కడి విపక్షాలు ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి.
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. జనవరి 7న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుక అధికార బంగ్లాదేశ్ అవామీ లీగ్ నుంచి నామినేషన్ వేస్తారని సమాచారం. షకీబ్ శనివారం నామినేషన్ ఫారమ్‌లు తీసుకున్నారని అవామీ లీగ్ జాయింట్ సెక్రటరీ జనరల్ బహౌద్దీన్ నసీమ్ తెలిపారు. అతను సెలబ్రిటీ, దేశ యువతలో మంచి పాపులారిటీ ఉందని, అతడిని రాజకీయాల్లోకి స్వాగతిస్తున్నామని అన్నారు. అయితే షకీబ్ అభ్యర్థిత్వాన్ని ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అధికార పార్టీ పార్లమెంటరీ బోర్డు ధృవీకరించాల్సి ఉంది.
Read Also: Priyanka Gandhi: కర్ణాటక గురించి మాట్లాడటం కాదు.. తెలంగాణలో ఏం చేశారు.. కేసీఆర్ పై ప్రియాంక ఫైర్
షకీబ్ తన జిల్లా మగురాలో లేదా రాజధాని ఢాకాలోని ఏదో స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు నసీమ్ చెప్పారు. హసీనా గత 15 ఏల్లుగా బంగ్లాదేశ్ ప్రధానిగా అదికారంలో ఉన్నారు. 17 కోట్ల జనాభా ఉన్న బంగ్లాదేశ్‌ని నియంతలా పాలిస్తున్నారని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆమె అధికారం నుంచి దిగిపోయి ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికలను ప్రతిపక్షాలు బహిష్కరిస్తే వరసగా నాలుగోసారి హసీనా అధికారంలోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. దక్షిణాసియా దేశాల్లో క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తమేం కాదు. బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ మష్రఫ్ మోర్తాజా 2018లో రాజకీయాల్లోకి చేరి అధికార పార్టీ నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు.