Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి
- చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
- మరో ఆర్మీ అధికారికి తీవ్ర గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్ ఆర్మీ నిర్వహించిన ఫీల్డ్ ఫైరింగ్ విన్యాసాల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చైనా తయారీ టైప్-59 ట్యాంక్ పేలిపోవడంతో ఇద్దరు సైనికులు మృతి చెందగా.. ఓ ఆర్మీ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం బంగ్లాదేశ్‌లోని చట్టోగ్రామ్‌లో ఉన్న హతాజారి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జరిగింది.
ఫైరింగ్ సమయంలో పేలిన ట్యాంక్
ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టరేట్ తెలిపిన వివరాల ప్రకారం.. సైనికులు ఫైరింగ్ విన్యాసాల్లో భాగంగా ట్యాంక్ నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పేలుడు సంభవించిన సమయంలో ట్యాంక్‌లో ఉన్న ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు ది డైలీ స్టార్ నివేదించింది. అదే సమయంలో బంగ్లాదేశ్ ఆర్మీకి చెందిన ఓ అధికారి తీవ్రంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆర్మీ అధికారిని మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్ ద్వారా ఢాకాలోని కంబైన్డ్ మిలిటరీ హాస్పిటల్ (CMH)కు తరలించారు. ఆయనకు అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
Also Read
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
చైనా మూలానికి చెందిన టైప్-59 ట్యాంక్
ప్రమాదానికి గురైన ట్యాంక్ చైనా మూలానికి చెందిన టైప్-59గా అధికారులు తెలిపారు. బంగ్లాదేశ్ ఆర్మీ ఈ ట్యాంకులను వినియోగిస్తోంది. చట్టోగ్రామ్‌లోని హతాజారి ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో సైనిక విన్యాసాలు జరుగుతున్న సమయంలోనే పేలుడు చోటుచేసుకుంది. అయితే ట్యాంక్ ఎందుకు పేలిందన్న దానిపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ప్రమాదానికి అసలు కారణాన్ని గుర్తించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ISPR వెల్లడించింది. పేలుడుకు దారితీసిన పరిస్థితులపై ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
Bangladesh Army’s Chinese-origin Type 59 tank reportedly exploded during a firing exercise, killing 2 crew members and injuring an officer.
Made in China. Used in Bangladesh. Deadly outcome. pic.twitter.com/Gn0FRx5ul4
— Shadow IND (@ShadowIND_IN) September 9, 2026
Bangladesh Army Tank Explodes During Firing Exercise
A Chinese-origin Type 59 tank reportedly exploded in Hathazari, Chattogram.
2 crew members killed
1 officer injured and taken to Chittagong CMH.
Cause remains unconfirmed. https://t.co/ln2QOsszLe pic.twitter.com/8wT2R9KgsJ— Shadow IND (@ShadowIND_IN) September 9, 2026
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ ఆర్మీ విన్యాసాల్లో అపశృతి.. చైనా ట్యాంక్ పేలి ఇద్దరు సైనికులు మృతి
-
TVK-Congress Alliance: విజయ్ పొలిటికల్ అలయన్స్‌కు కొత్త పేరు.. కాంగ్రెస్, VCK, MDMK, IUMLతో కలిసి కొత్త రాజకీయ శక్తి
-
Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
-
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్ 2026 షెడ్యూల్ విడుదల.. సభ్య దేశాలు, షెడ్యూల్, టైమింగ్స్ తెలుసుకోండి
-
Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!