NTV Telugu Site icon

Explosion: బంగారు గనిలో భారీ పేలుడు, 59 మంది మృతి

పశ్చిమ ఆఫ్రికా దేశంలోని బుర్కినా ఫాసోలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. బామ్ బ్లోరా గ్రామంలోని బంగారు గ‌నిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 59 మంది మృత్యువాత పడినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయ‌ప‌డిన‌ట్టు అధికారులు వెల్ల‌డించారు. మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంది. బంగారాన్ని శుద్ధిచేసే రసాయనాల వల్లే పేలుడు సంభవించిందని సమాచారం.

పేలుడు సంభవించిన వెంటనే మృత‌దేహాలు చెల్లా చెదురుగా పడిపోయాయని… తొలి పేలుడు రాత్రి 2 గంట‌ల స‌మ‌యంలో జ‌రిగింద‌ని ఓ అధికారి వెల్ల‌డించారు. కాగా ఆఫ్రికాలో బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి దేశాల్లో బుర్కినా ఫాసో ఒకటి. ప్రపంచంలో ఐదో అతిపెద్ద దేశంగా ఉన్నది. దేశంలోని బంగారు గనుల్లో సుమారు 10.5 లక్షల మంది పనిచేస్తున్నారు. గామ్‌బ్లోరాలో దాదాపు 800 ఎకరాల్లో చిన్న చిన్న బంగారు గనులు ఉన్నాయి. ఇక్కడి నుంచి టోగో, బెనైన్‌, నైగర్‌, ఘనా దేశాలకు బంగారాన్ని అక్రమంగా తరలిస్తుంటారు.