NTV Telugu Site icon

ఇంగ్లాండ్ లో వేగంగా వ్యాప్తి చెందుతున్న ఇండియా వేరియంట్ లు… ఎన్ని కేసులంటే.. 

ఇండియాలో బి 1.617 ర‌కం వేరియంట్ వ్యాప్తి కార‌ణంగా క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే.  సెకండ్ వేవ్‌లే ఈ వేరియంట్ అధికంగా వ్యాప్తి చెందింది. కాగా, ఈ వేరియంట్ ఇండియాతో పాటుగా ఇతర దేశాల‌కు కూడా వ్యాపిస్తోంది. దాదాపుగా 44 దేశాల‌కు పైగా ఈ వేర‌యంట్ వ్యాప్తి చెందింది.  ఇండియా త‌రువాత ఈ వేరియంట్ కేసులు బ్రిట‌న్‌లో న‌మోద‌వుతున్నాయి.  బ్రిట‌న్‌లో దాదాపుగా 2300 బి. 1.617 వేరియంట్ కేసులు న‌మోద‌య్యాయి.  ఈ విష‌యాన్ని బ్రిట‌న్ ఆరోగ్య‌శాఖ స్ప‌ష్టం చేసింది. బోల్ట‌న్‌, బ్లాక్ బ‌ర్న్ ప్రాంతాల్లో కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్న‌ట్టు అధికారులు చెప్తున్నారు.  జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు అధికారులు హెచ్చ‌రిస్తున్నారు.