కరోనా బారిన పడి ఇళ్లల్లో చికిత్స పొందుతున్న వారికి అజిత్రో మైసిన్ మెడిసిన్‌ను రిఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అజిత్రో మైసిన్ కంటే ప్లాసిబో మెడిసిన్ మేలైనదని తాజా పరిశోధనలో తేలింది. అజిత్రో మైసిన్ ను వినియోగించడం వలన ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం రావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కాలిఫోర్నియా, స్టాన్‌ఫోర్డ్ కు చెందిన పరిశోధకులు చేసిన ఈ పరిశోధనలలో ఈ విషయాలు వెలుగుచూశాయి. కోవిడ్ బారిన పడి ఇళ్లల్లో చికిత్స పొందుతున్న 263 మందిలో 171 మందికి 2.1 గ్రాముల అజిత్రోమైసిన్ మొదటి డోస్‌ను ఇచ్చారు.
Read: పండగ చేసుకుంటున్న రెహ్మాన్ ‘పరమ్ సుందరి’!
మిగిలిన 92 మందికి ప్లాసిబో మాత్రలను అందించారు. ఈ మెడిసిన్‌ను తీసుకున్న రెండు వారాల తరువాత నెగెటివ్ వచ్చింది. కానీ, అజిత్రో మైసిన్ తీసుకున్న వారిలో 21 రోజుల తరువాత 5 శాతం మందికి తిరిగి కరోనా లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరారు. కానీ, ప్లాసిబో మాత్రలు తీసుకున్న వారిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదని పరిశోధకులు చెబుతున్నారు.
