Site icon NTV Telugu

Ayatollah Ali Khamenei Funeral: ఖమేనీని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఎప్పుడు.. ఎక్కడ.. సమయం తెలుసుకోండి..

Ayatollah Ali Khamenei Fune

Ayatollah Ali Khamenei Fune

Ayatollah Ali Khamenei Funeral: ఇరాక్‌–ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్‌ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. దేశవ్యాప్తంగా సంతాప దినాలు ప్రకటించగా, ఆయనకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖమేనీ అంత్యక్రియలకు సంబంధించిన సమయం, ప్లేస్‌, తేదీలను ప్రకటించారు..

ఎక్కడ ఖననం?
ఖమేనీని ఇరాన్‌లోని పవిత్ర నగరమైన మషద్‌లో ఖననం చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఆయన జన్మస్థలం కూడా మషద్‌నే. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన Imam Reza Shrine ప్రాంగణంలోనే ఖననం చేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ స్థలం షియా ముస్లింలకు అత్యంత పవిత్ర యాత్రా కేంద్రంగా గుర్తింపు పొందింది.

వీడ్కోలు కార్యక్రమం ఎక్కడ?
ఖమేనీకి ముందుగా రాజధాని టెహ్రాన్‌లో ప్రజలు నివాళులర్పించేలా భారీ వీడ్కోలు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి గౌరవాలతో ఈ కార్యక్రమం జరుగుతోంది.

అంత్యక్రియల సమయం
ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి 10:00 గంటలకు ప్రధాన అంత్యక్రియలు ప్రారంభమవుతాయని స్థానిక మీడియా నివేదించింది. మూడు రోజుల పాటు ప్రజలు వచ్చి నివాళులు అర్పించేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం మషద్‌కు భౌతిక కాయాన్ని తరలించి ఖననం చేయనున్నారు.

ఖమేనీ వారసత్వం
1979 ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్ రెండవ సుప్రీం నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన ఖమేనీ.. దాదాపు మూడు దశాబ్దాలకుపైగా దేశాన్ని నడిపించారు. రక్షణ, విదేశాంగ, ఆర్థిక విధానాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. మధ్యప్రాచ్య రాజకీయాల్లో కూడా ఆయన ప్రభావం గణనీయంగా నిలిచింది. ఇరాన్–అమెరికా–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రాంతీయ పరిస్థితులు ఇంకా అస్థిరంగానే ఉన్నాయి. తాజా ఘర్షణల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంచనాలు సూచిస్తున్నాయి.

Exit mobile version