NTV Telugu Site icon

PM Anthony Albanese: మరోసారి ఆ దేశ ప్రధానికి కరోనా పాజిటివ్‌..

Pm Anthony Albanese

Pm Anthony Albanese

చైనాను మినహాయిస్తే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కేసుటు తగ్గుముఖం పట్టాయి.. అయితే, వీవీఐపీలను సైతం వదలలేదు కోవిడ్.. ఇప్పటికే ఎంతో మంది కరోనా బారినపడ్డారు.. వీరిలో వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఉన్నతాధికారులు, ఇలా ఎవ్వరూ మినహాయింపు కాదు అన్నట్టుగా అందరినీ టచ్‌ చేస్తూ వచ్చింది.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కేసులు తగ్గుతోన్న సమయంలో.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ మరోసారి కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్వహించిన కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది.. దీంతో, తనతో క్లోజ్‌గా ఉన్నవాళ్లను అప్రమత్తం చేశారు ప్రధాని.

Read Also: Union minister Nisith Pramanik: బీజేపీతో టచ్‌లో 40-45 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

తనకు కరోనా సోకడంపై ప్రధాని అల్బనీస్ మాట్లాడుతూ.. తనతో ఉన్న వారిని జాగ్రత్తగా ఉండమని, వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.. తాను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉంటూ ఇంటి నుంచే తన పనిని చేస్తానని వెల్లడించారు.. అయితే, ఆయన కరోనాబారిన పడడం ఇది రెండోసారి.. ఫెడరల్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు.. అయితే, అల్బనీస్ లేబర్ పార్టీ ఏ ఎన్నికల్లో విజయం సాధించింది. మరోవైపు, ప్రధాని అల్బనీస్ ఈ నెల 12, 13 తేదీల్లో పాపువాన్యూ గినియాలో రెండు రోజుల పర్యటనకు సిద్ధం అవుతోన్న తరుణంలో.. ఆయన రెండోసారి కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. మరోవైపు, నవంబర్ 29 వరకు ఆస్ట్రేలియాలో 100,422 కోవిడ్ -19 కేసులు వెలుగుచూశాయి.. రోజుకు సగటున 14,346 కేసులు ఉన్నాయి, ఇది అంతకుముందు వారం కంటే 20 శాతం ఎక్కువ, దేశ ఆరోగ్య శాఖలో అందుబాటులో ఉన్న తాజా గణాంకాల ప్రకారం జనాభాలో దాదాపు 90 శాతం మంది కరోనావైరస్ వ్యాక్సిన్ యొక్క కనీసం రెండు మోతాదులను తీసుకుని ఉన్నారు.