NTV Telugu Site icon

Australia: ఇండియన్ వ్యక్తిపై రూ.5 కోట్ల రివార్డ్ ప్రకటించిన ఆస్ట్రేలియా.. ఎందుకో తెలుసా..?

Rs 5 Crore Reward On Indian Man

Rs 5 Crore Reward On Indian Man

Australian police have offered a reward of Rs 5 crore for an Indian man in a beach murder case: భారతీయ వ్యక్తిపై ఆస్ట్రేలియన్ పోలీసులు ఏకంగా ఒక మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది. భారతీయ కరెన్సీలో దాదాపుగా రూ.5 కోట్ల భారీ రివార్డు ఇది. నాలుగేళ్ల క్రితం 2018లో ఆస్ట్రేలియన్ బీచ్ లో ఓ హత్య చేసిన తర్వాత పారిపోయిన భారతీయ వ్యక్తి  కోసం ఆస్ట్రేలియా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. దేశం వదిలి పారిపోయిన వ్యక్తి కోసం ఏకంగా భారీ నజరానాను ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియా క్వీన్స్ లాండ్ ఇన్నిస్‌ఫైల్‌లో నర్సుగా పనిచేసిన రాజ్‌విందర్ సింగ్ (38) అక్టోబర్ 2018లో తోయా కార్డింగ్ లీ అనే మహిళను దారుణంగా చంపేశాడు.  కైర్న్స్ లో హత్య జరిగింది. ఈ కేసులో రాజ్‌విందర్ సింగే కీలక నిందితుడని ఆస్ట్రేలియా పోలీసులు పేర్కొంటున్నారు.

Read Also: Apple: ఆపిల్ యూజర్లకు గుడ్ న్యూస్.. అప్పటి నుంచి ఐ ఫోన్‌లలో 5జీ సేవలు

ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత రాజ్‌విందర్ సింగ్ ఆస్ట్రేలియాలో ఉద్యోగం, భార్య, పిల్లలను వదిలి దేశం వదిలి పరారయ్యాడు. క్వీన్స్ లాండ్ పోలీసులు గత నాలుగేళ్లుగా రాజ్‌విందర్ సింగ్ కోసం గాలింపు చేపడుతున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు అతని ఆచూకీ లభించలేదు. ఈ రివార్డ్ క్వీన్స్ లాండ్ పోలీసుల చరిత్రలోనే అతిపెద్దది. హత్య తరువాత అక్టోబర్ 22న కైర్న్స్ నుంచి బయలుదేరి 23న సిడ్నీకి చేరుకున్న రాజ్‌విందర్ సింగ్ భారత్ పారిపోయాడని అక్కడి పోలీసులు ఆరోపిస్తున్నారు.

రాజ్‌విందర్ సింగ్ ప్రస్తుతం భారత్ లోనే ఉన్నాడని ఆస్ట్రేలియా పోలీసులు ధృవీకరించారు. కైర్న్స్ కేంద్రంగా దర్యాప్తు కేంద్రం ఏర్పడింది. ఈ కేసు కోసం హిందీ, పంజాబీ మాట్లాడే పోలీసుల అధికారులను నియమించారు. భారతదేశంలో ఉన్న సింగ్ ఆచూకీ గురించి వాట్సాప్ ద్వారా అధికారులకు తెలియజేసేలా చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఈ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో తెలుసని.. ఈ కేసులో సహకరించాలని కోరుతున్నామని మినిస్టర్ మార్క్ ర్యాన్ అన్నారు. రాజ్‌విందర్ సింగ్‌ను ట్రాక్ చేయడానికి ఈ భారీ రివార్డు సహకరిస్తుందని అక్కడి పోలీసులు భావిస్తున్నారు. ఈ వ్యక్తిని పట్టుకునేందుకు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించేందుకు ఈ రివార్డు కీలకం అని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు.

Show comments