Site icon NTV Telugu

Australia: ప్రైవేట్ పార్ట్‌లోకి బ్యాటరీలు చొప్పించుకున్న వ్యక్తి.. ఆ తర్వాత ఏమైందంటే..?

Australia

Australia

Australia: ఆస్ట్రేలియాకు చెందిన 73 ఏళ్ల వ్యక్తి విచిత్ర సమస్యను ఎదుర్కొన్నాడు. లైంగిక సంతృప్తి కోసం మూత్రనాళంలోకి చిన్న బటన్ సైజ్ బ్యాటరీలను చొప్పించుకున్నాడు. అయితే, వాటిని బటయకు తీయడంతో విఫలం కావడంతో 24 గంటల్లో సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. ఈ విచిత్రమైన కేసు మార్చి నెలలో ‘‘యూరాలజీ కేస్ రిపోర్ట్స్’’లో ఒక అధ్యయనంలో ప్రచురించారు.

స్టడీలో 13.5 ఎంఎం వెడల్పు, 3.2 ఎంఎం ఎత్తు ఉన్న బ్యాటరీలను తొలగించడానికి వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. గతంలో కూడా సదరు వ్యక్తి లైంగిక సంతృప్తి కోసం పురుషాంగంలోని మూత్రనాళంలోకి ఇలాగే బ్యాటరీలను చొప్పించుకున్నాడు, వాటిని సులభంగానే ఎలాంటి సమస్య లేకుండా తొలగించుకున్నాడు, ఈ సారి మాత్రం కథ అడ్డం తిరిగింది. ‘పెనైల్ యురేత్రా’ సమీపంలోకి ఈ బ్యాటరీలు చేరిపోయాయి. దీంతో అతడు వాటిని తొలగించుకోలేకపోయాడు.

Read Also: Varun Tej: ‘ఆపరేషన్ వాలెంటైన్’ను వేరే లెవల్లో ప్రమోట్ చేస్తున్న వరుణ్.. పుల్వామా టు వాఘా దేన్నీ వదలకుండా!

పరిస్థితిని తీవ్రతను గమనించిన వైద్యులు, ఆ బ్యాటరీలు రెండు గంటల్లోనే నెక్రోసిస్, శరీర కణజాలం మరణానికి కారణమవుతుండని తెలిసి సర్జరీ చేసి వాటిని తొలగించారు. అతను తీవ్రమైన ఫారఫిమోసిస్‌తో బాధపడ్డాడు, మూత్ర విసర్జన ఆగిపోయింది, సకాలంలో వైద్యం అందకపోతే కణజాలాలు నాశనమయ్యేవని వైద్యులు చెప్పారు. ఇదే కాకుండా గ్యాంగ్రీన్ అనే ప్రాణంతకమైూన ఇన్ఫెక్షన్ గురించి వైద్యులు భయపడ్డారు.

సదరు వ్యక్తి గత మూడేళ్లుగా అంగస్తంభన సమస్యతో బాధపడుతున్నాడు, షాక్ వేవ్ థెరపీని కూడా చేయించుకున్నట్లు నివేదికలో తేలింది. ప్రస్తుతం అతను డిశ్చార్జ్ అయ్యాడు, అయితే, పురుషాంగం వాపు, మూత్ర సమస్యల కారణంగా ఆస్పత్రికి తిరిగి వచ్చాడు. ప్రస్తుతం అతని పురుషాంగంలో మూత్రనాళాల నిర్మాణం కోసం మూడు సర్జరీలు చేయాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు. పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ఇది సరైన ఎంపిక కాదని నిర్ణయించుకున్నారు.

Exit mobile version