Site icon NTV Telugu

Dating Fraud: ఆన్‌లైన్‌లో కలిసింది.. దేశం దాటింది.. మోసపోయింది

Dating Fraud

Dating Fraud

Australian Girl Cheated By New Zealand Boyfriend Who Met On Dating App: సోషల్ మీడియా వాడకం పెరిగినప్పటి నుంచి.. యువతీ, యువకులు ఆన్‌లైన్‌లోనే తమ ప్రేమని వెతుక్కుంటున్నారు. కొందరికి స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతోంది కానీ, మిగతా వాళ్లకు మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా ఓ యువతికి కూడా అలాంటి అనుభవమే ఎదురైంది. ఆన్‌లైన్‌తో పరిచయమైన ఓ అబ్బాయితో ప్రేమలో పడిన ఆ యువతి.. తీరా అతడ్ని కలిశాక ఘోరంగా మోసపోయింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాకు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఆన్‌లైన్‌లో న్యూజీలాండ్‌కు చెందిన ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. ఫోటోల్లో ఆ అబ్బాయి చాలా హ్యాండ్సమ్‌గా కనిపించడంతో.. అతనితో చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఆ అబ్బాయి కూడా సానుకూలంగానే స్పందించేవాడు.

Salaar: ఎన్ని సినిమాలొచ్చినా ఈ నెల ‘సలార్‌’దే…

ఈ క్రమంలోనే.. ఆస్ట్రేలియన్ అమ్మాయి అతనికి మనసు ఇచ్చేసింది. పిచ్చిపిచ్చిగా ప్రేమించింది. దీంతో.. అతడ్ని కలవాలని నిర్ణయించుకుంది. న్యూజీలాండ్‌లోని ఒక హోటల్‌లో కలుసుకుందామని ఇద్దరూ ఫిక్స్ అయ్యారు. ఇంకేముంది.. తన ప్రియుడ్ని కలిసేందుకు ఆ యువతి అందంగా ముస్తాబై, న్యూజీలాండ్‌కు వెళ్లింది. హోటల్‌లో తన అతని కోసం వెయిట్ చూడసాగింది. ఇంతలో ఆ బాయ్‌ఫ్రెండ్ రాగానే.. ఆ యువతి ఒక్కసారిగా షాకయ్యింది. ఎందుకంటే.. తాను ఇన్నాళ్లు చాటింగ్ చేసింది అబ్బాయితో కాదు, అమ్మాయితో! ఈ న్యూజీలాండ్ యువతి సరదా కోసం అబ్బాయి పేరుతో ఫేక్ ప్రొఫైల్ చేసింది. ఎందుకు ఈ పని చేశావని ఆస్ట్రేలియన్ యువతి అడిగితే.. ‘నువ్వు నిజంగానే వస్తావో, రావో పరీక్షించడం కోసం చేశాను’ అని బదులిచ్చింది. చివరికి చేసేదేమీ లేక.. ఆ ఆస్ట్రేలియన్ అమ్మాయి తిరిగి వెనక్కు వెళ్లిపోయింది.

Indian Railways: రైలు టికెట్ తీసుకున్నా.. ప్లాట్‌ఫారమ్‌పై జరిమానా చెల్లించాల్సిందే.. ఇది తెలుసుకోండి

Exit mobile version