భారత్‌లో దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను విస్తృతంగా పంపిణీ చేస్తోంది ప్రభుత్వం.. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిషీల్డ్‌కు అనుమతి ఇచ్చినా.. కోవాగ్జిన్‌కు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.. దీంతో.. ఆ వ్యాక్సిన్ తీసుకున్నవారి విదేశీ పర్యటలనపై తీవ్ర ప్రభావం పడింది.. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు కోవాగ్జిన్ తీసుకున్నవారికి కూడా తమ దేశంలోకి వచ్చేందుకు అనుమతిఇస్తుండగా.. మరికొన్ని దేశాలు మాత్రం.. డబ్ల్యూహెచ్‌వో ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి.. అయితే, భారత్ బయోటెక్ సంస్థకు చెందిన కోవాగ్జిన్ టీకా వేసుకున్న వారు కూడా తమ దేశంలో అడుగుపెట్టేందుకు అనుమతి ఇస్తున్నట్ఉట ప్రకటించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం.
ఆసీస్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది ప్రయాణికులకు ఊరటకలిగించింది.. కోవాగ్జిన్‌కు ఇంకా డబ్ల్యూహెచ్వో గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోయినా.. దాదాపు 600 రోజుల తర్వాత మళ్లీ అంతర్జాతీయ ప్రయాణికులకు ఓకే చెప్పింది ఆస్ట్రేలియా… దీంతో ఇవాళ్టి నుంచి ఆ దేశంలో అంతర్జాతీయ ప్రయాణికుల తాకిడి మళ్లీ మొదలైంది. ప్రయాణికుల వ్యాక్సినేషన్ స్టాటస్ విషయంలో ఒప్పటి వరకు కోవిషీల్డ్‌కు అనుమతి ఉండగా.. ఇప్పుడు కోవాగ్జిన్‌కు గుర్తింపు ఇస్తునట్లు ఆస్ట్రేలియా వెల్లడించింది. ఆస్ట్రాజెనికా, మోడెర్నా.. మిక్సిడ్ వ్యాక్సిన్లు తీసుకున్నవారికి కూడా అనుమతి ఇస్తోంది ఆస్ట్రేలియా. కోవాగ్జిన్, సైనోఫార్మ్‌లకు అనుమతి దక్కిన నేపథ్యంలో ఆ దేశంలో అడుగుపెట్టిన తర్వాత 14 రోజుల హోటల్ క్వారెంటైన్ ఉంటుందని ఆస్ట్రేలియా పేర్కొంది. అయితే, రెండో డోసులు తీసుకోనివారు మాత్రమే క్వారెంటైన్‌లో ఉండాల్సిన అవసరం ఉండగా.. 12 ఏళ్లు దాటిన వారు ఎవరైనా కోవాగ్జిన్ తీసుకుంటే వారికి బోర్డర్ ఫోర్స్ అనుమతి ఇవ్వనున్నట్లు ఆస్ట్రేలియా పేర్కొంది. దీంతో.. చాలా మందికి ఊరటలభించింది. అయితే, ఇది కేవలం ఇండియన్స్‌కు మాత్రమే ఊరటగా చూడలేం.. ఎందుకంటే.. ఇతర దేశాలకు కూడా ఈ వ్యాక్సిన్ ఎగుమతి అయిన సంగతి తెలిసిందే.
