లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా అక్కడ ఉద్యమం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆస్ట్రేలియాలో కరోనా మళ్లీ వ్యాపిస్తోంది. ముఖ్యంగా సిడ్నీలో రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆస్ట్రేలియా ప్రభుత్వం అక్కడ రెండో దశ లాక్డౌన్ విధించింది. కరోనా లాక్డౌన్ ఆంక్షలను వ్యతిరేకిస్తూ వేలాది మంది ప్రజలు రోడ్లెక్కారు. నిరసనలతో హోరెత్తిస్తున్నారు. సిడ్నీ సహా పలు ప్రధాన నగరాల్లో ఆందోళనలు మిన్నంటాయి. లాక్‌డౌన్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. ఫ్రీడం, అన్మాస్క్ ది ట్రూత్ నినాదంతో ఆస్ట్రేలియాలో నిరసనలు కొనసాగుతున్నాయి. సిడ్నీ సహా అనేక నగరాల్లో ప్రజలు వీధుల్లోకి వచ్చి లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడంతో… తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్లపై బారికేడ్లను తోసేసి, ప్లాస్టిక్ సీసాలను, ఇతర వస్తువులను పోలీసులపైకి విసిరేయడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. వందలాది మంది ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. కరోనా కట్టడికి లాక్డౌన్ తప్పని సరి అంటోంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు ఫ్రాన్స్, బ్రిటన్‌లోనూ లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. స్వేచ్ఛ, స్వేచ్ఛ అంటూ నినదిస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్‌పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!