Site icon NTV Telugu

Social Media Ban: ఆస్ట్రేలియాలో సోషల్ మీడియా బ్యాన్.. ఆ రోజు నుంచే అమలు!

Aus

Aus

Social Media Ban: ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, టిక్‌టాక్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఆంక్షలు అమలు విధించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమైంది. 16 ఏళ్లలోపు వినియోగదారులను తొలగించాలని ఇప్పటికే ఆసీస్ పార్లమెంట్ ఆమోదించింది. ఈ నిబంధనలను పాటించకపోతే.. టెక్ కంపెనీలకు భారీ జరిమానా విధిస్తామని తెలిపింది. దీని కోసం 2025 డిసెంబర్ 10వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఇక, ఆస్ట్రేలియా పార్లమెంట్ విధించిన.. అండర్-16 సోషల్ మీడియా నిషేధాన్ని పాటించడానికి తాము రెడీగా ఉన్నామని మెటా, టిక్‌టాక్ అండ్ స్నాప్‌చాట్ పేర్కొన్నాయి.

Read Also: Producers Council: మీరు అనుకుంటే సరిపోద్దా.. హీరోలూ అనుకోవాలిగా!

అయితే, చట్టానికి మేము కట్టుబడి ఉన్నప్పటికీ, దీనిని సమర్థవంతంగా అమలు చేయడం చాలా కష్టమని సోషల్ మీడియా దిగ్గజాలు ప్రకటించాయి. ఇలాంటి చట్టాన్ని విధించడం పట్ల తీవ్ర ఆందోళన కొనసాగుతుంది. డిసెంబర్ 10వ తేదీ నాటికి 16 ఏళ్లలోపు ఉన్న లక్షలాది మంది యూజర్లను గుర్తించి, వారిని తొలగించడం అనేది చాలా పెద్ద సవాలుతో కూడి పని అన్నారు. దీనిని పరిష్కరించడం అంత ఈజీ కాదు అని మెటా పాలసీ డైరెక్టర్ మియా గార్లిక్ వెల్లడించారు. కాగా, వయసుకు సంబంధించిన ఈ సోషల్ మీడియా నిషేధం తీవ్ర పరిణామాలకు దారితీసే ఛాన్స్ ఉందని టిక్‌టాక్ ఆస్ట్రేలియా పాలసీ లీడ్ ఎల్లా ఉడ్స్ జాయిస్ ప్రకటించారు. ఆసీస్ పార్లమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని టెక్ కంపెనీలు విమర్శించాయి. 16 ఏళ్లలోపు వారిపై సోషల్ మీడియాలో నిషేధం విధించడం అనేది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన నిర్ణయమని చెప్పుకొచ్చారు.

Exit mobile version