ప్రేమ.. ఎవరి మనస్సులో ఎప్పుడు పుడుతుందో ఎవ్వరం చెప్పలేము.. చిన్నా పెద్దా తేడా ఉండదు దానికి.. వావి వరుసలను పట్టించుకోదు.. అందుకే ప్రేమ గుడ్డిది అంటారు. తాజాగా అలంటి ఒక లవ్ స్టోరీయే సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. ఎవరికైన కూతురు భర్త అంటే కొడుకుతో సమానం.. అత్తగారు.. అల్లుడు వస్తున్నాడంటేనే వణికిపోతుంది. అతనికి అది వండి పెట్టాలి.. ఇది వండి పెట్టాలి అని కంగారు పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకొనే అత్తగారు మాత్రం కూతురు పెళ్లి చేసుకునే అబ్బాయితో ప్రేమలో పడిపోయింది.. ఈ విషయాన్ని నిర్మొహమాటంగా కూతురికి కూడా చెప్పేసింది. మరి ఆ తరువాత ఏమైంది..?
సోషల్ మీడియాలో ఒక నెటిజన్ తన వెడ్డింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఆసక్తికరమైన లవ్ స్టోరీని పోస్ట్ చేసింది. నా పెళ్ళిలో నా తల్లిని మిస్ అయ్యాను అని చెప్పుకొచ్చింది.. దానికి కారణం కూడా చెప్పింది. అయితే ఆ కారణం విన్న వారందరూ ముక్కున వేలేసుకున్నారు. ఎందుకు ఆమె తన కూతురు పెళ్లికి అటెండ్ కాలేదన్న విషయాన్ని చెప్తూ ” నా తల్లి నేను పెళ్లిచేసుకోబోయే అబ్బాయి ప్రేమలో పడిపోయింది. అతడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పింది. ఈ విషయం విని నేను చాలా షాక్ అయ్యాను. ప్రేమించినవాడు పెళ్ళికి నేను రాలేను అని చెప్పింది.. అంతేకాకుండా నా జీవితం కోసం ఆమె తన డెసిషన్ ని మార్చుకొంటానని చెప్పింది. అల్లుడి మీద ఉన్న ప్రేమను తగ్గించుకొంటానని చెప్పింది” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ లవ్ స్టోరీ విన్నవారందరు ఆమె తల్లిపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇదెక్కడి లవ్ స్టోరీ కూతురు భర్తతో ప్రేమ ఏంటీ..? అని కొందరు.. మీ తల్లిని నమ్మకండి.. ఫ్యూచర్ లో మిమ్మల్ని మోసం చేయొచ్చు అని మరికొందరు సలహాలు ఇస్తున్నారు.