North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కి లగ్జరీ కార్‌లు అంటే విపరీతమైన మోజు. అయితే ఆ దేశ అణు కార్యక్రమాల నేపథ్యంలో ఉత్తర కొరియాపైన ప్రపంచంలో చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో ఆ దేశానికి లగ్జరీ వస్తువులు చేరాలంటే అక్రమ రవాణానే మార్గం. దేశంలో ప్రజలు తినడానికి తిండి లేనప్పటికీ.. కిమ్‌కి మాత్రం ఫారెన్ మందు, స్విట్జర్లాండ్ చీజ్ మాత్రం ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. వీటిలో పాటు విలువైన కార్లను స్మగ్లింగ్ ద్వారా తన దేశానికి తెప్పించుకుంటాడు.
Read Also: Air India: ఎయిరిండియా పైలట్లకు, సిబ్బందికి కొత్త యూనిఫాం.. అదిరిపోయేలా మనీష్ మల్హోత్రా డిజైన్..
ఇదిలా ఉంటే గత వారం 70,000 డాలర్ల విలువైన లెక్సస్ సెనాన్ కార్‌ని ఉత్తర కొరియాలోకి అక్రమంగా తరలించే ప్రయత్నాలను జపాన్ పోలీసులు అడ్డుకున్నారని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. ఏనుగు దంతాల అక్రమ రవాణాపై స్విట్జర్లాండ్‌లోని ఉత్తరకొరియా రాయబారిని రీకాల్ చేసిన రోజే ఈ కారు అక్రమ రవాణాను అడ్డుకున్నారు. జపాన్‌లోని చిబా ప్రిఫెక్చర్‌లో యూజ్డ్ కార్ షోరూంపై దాడి చేసి ఈ కార్‌ని పట్టుకున్నారు. ఈ లగ్జరీ కారుని బంగ్లాదేశ్ మీదుగా సింగపూర్ పంపుతున్నట్లు షోరూం పేపర్లు సమర్పించినట్లుగా జపాన్ వార్తా సంస్థ అసాహి షింబున్ నివేదించింది. షోరూం యజమానులను పోలీసులు ప్రశ్నించడం, గతంలో జరిగిన ట్రాన్స్‌ఫర్లను చూడటంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
అణు కార్యకలాపాల నేపథ్యంలో నార్త్ కొరియాపై ఐక్యరాజ్యసమితి తీర్మానం ప్రకారం లగ్జరీ కార్లు, ఇతర అత్యాధునిక వస్తువుల ఎగుమతులు నిషేధించబడ్డాయి. కిమ్ జోంగ్ ఉన్ లగ్జరీ కార్లంటే విపరీతమైన మోజు. గతంలో మెర్సిడెస్-మేబ్యాక్ GLS 600 మరియు లెక్సస్ LX SUVలో ఆయన కనిపించినట్లు వార్తకథనాలు వచ్చాయి. మెర్సిడెస్ మే బ్యాక్ సంబంధించి ఇప్పటికీ డబ్బులు చెల్లించలేదు.
