Bangladesh: బంగ్లాదేశ్ వైమానిక స్థావరంపై దాడి, ఒకరు మృతి..
- బంగ్లాదేశ్ ఎయిర్ బేస్‌పై స్థానికుల దాడి..
- కాల్పుల్లో ఒక స్థానికుడు మృతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ కాక్స్ బజార్ జిల్లాలోని వైమానిక స్థావరంపై సోమవారం కొంత మంది నేరస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో కనీసం ఒకరు మరణించినట్లు బంగ్లాదేశ్ సైన్యం ధ్రువీకరించింది. సోర్సెస్ ప్రకారం.. బాధితుడిని 30 ఏళ్ల స్థానిక వ్యాపారి షిహాబ్ కబీర్‌గా గుర్తించారు. ఇతడిని కాల్చి చంపినట్లు సమాచారం.
Read Also: Maharashtra: ‘‘మహాయుతి’’లో చీలిక.. ఫడ్నవీస్, షిండేల మధ్య మరింత దూరం..?
Also Read
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్‌ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- US Tailor Income: గంటకు అన్ని వేలా ? అమెరికా టైలర్ గంట సంపాదన చూసి నెటిజన్లు షాక్! వైరల్ వీడియో..
- Donald Trump: గూగుల్, చాట్‌జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
బంగ్లాదేశ్ సాయుధ దళాల ప్రజా సంబంధాల విభాగం ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) ప్రకటన ప్రకారం.. ‘‘కాక్స్ బజార్ వైమానిక స్థావరానికి అనుకుని ఉన్న సమతి పారా నుంచి కొంతమంది నేరస్తులు కాక్స్ బజార్ వైమానిక స్థావరంపై దాడి చేశారు. ఈ విషయంలో బంగ్లాదేశ్ వైమానిక దళం అవసరమైన చర్యలు తీసుకుంటోంది’’ అని చెప్పింది.
సమాచారం ప్రకారం.. అంతకుముందు రోజు భూ వివాదం చెలరేగిన కొన్ని గంటల తర్వాత ఈ దాడి జరిగింది. ఇది వైమానిక సిబ్బందికి, స్థానిక నివాసులకు మధ్య ఘర్షణకు దారి తీసింది. స్థానికులు రాళ్లు రువ్వడంతో ఘర్షణ హింసాత్మకంగా మారింది. దీని ఫలితంగా రెండు వైపుల గాయాలయ్యాయి. అయితే, అధికారులు మాత్రం ఎంత మంది అన్నది పేర్కొనలేదు. ఈ ఘర్షణలో బాధితుడికి తుపాకీ గాయాలయ్యాయి, కాక్స్ బజార్ జిల్లాలోని సదర్ ఆస్పత్రికి మృతుడిని తీసుకువచ్చారని వైద్య వర్గాలు తెలిపాయి. ఘర్షణకు దారితీసిన కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు నిర్వహిస్తామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని కాక్స్ బజార్ డిప్యూటీ కమిషనర్ మొహమ్మద్ సలావుద్దీన్ తెలిపారు.
తాజావార్తలు
-
chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్‌తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్‌పై మెగాస్టార్ రియాక్షన్‌ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
-
CM Revanth Reddy : మల్కాజ్గిరి నా రాజకీయ పునర్జన్మ..
-
Vaibhav Sooryavanshi: ‘నా ఆట బానే ఉంటుంది కదా.. మరి వాళ్లు అలా ఎందుకు చేశారు’.. భావోద్వేగానికి గురైన సూర్యవంశీ..
-
Varanasi: వారణాసి నుంచి మాంసం దుకాణాలు అవుట్..
-
Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్‌లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!