NTV Telugu Site icon

Israel-Gaza War: గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 50 మంది చిన్నారుల సహా 84 మంది మృతి

Gaza

Gaza

గాజాపై ఇజ్రాయెల్ దాడులు సాగిస్తూనే ఉంది. గత 24 గంటల్లో గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 50 మంది చిన్నారుల సహా 84 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 192 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబర్ 7, 2023న హమాస్ లక్ష్యంగా మొదలైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు లెబనాన్ పై కూడా దాడులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో లెబనాన్‌లో 30 మంది మరణించినట్లు లెబనీస్ ఆరోగ్య శాఖ తెలిపింది. స్థానిక అధికారుల ప్రకారం.. లెబనాన్‌లోని బెకా వ్యాలీలోని కనీసం 25 పట్టణాలు, గ్రామాలపై శుక్రవారం భారీగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. డజన్ల కొద్దీ ప్రజలు మరణించారు.

ఇది కూడా చదవండి: Cauliflower: క్యాలీఫ్లవర్ తింటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి..

ఉత్తర గాజాలోని నివాస భవనాలపై ఇజ్రాయెల్ జరిపిన రెండు దాడుల్లో 50 మంది చిన్నారులు సహా 84 మంది పాలస్తీనియన్లు మరణించారు. అమెరికా అదనపు బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ డిస్ట్రాయర్‌లు, ఫైటర్ స్క్వాడ్రన్ మరియు ట్యాంకర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు, అనేక యూఎస్ వైమానిక దళం B-52 లాంగ్-రేంజ్ స్ట్రైక్ బాంబర్‌లను మధ్యప్రాచ్యంలో మోహరించనున్నట్లు పెంటగాన్ తెలిపింది. ఖాన్ యూనిస్‌లో వైమానిక దాడిలో హమాస్ సీనియర్ అధికారి ఇజ్ అల్-దిన్ కస్సాబ్‌ను చంపినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. గాజా కాల్పుల విరమణ చర్చలను ఇజ్రాయెల్ సీరియస్‌గా తీసుకోవడం లేదని, యుద్ధాన్ని శాశ్వతంగా నిలిపివేయాలనే డిమాండ్‌లకు తగ్గట్టుగా తాత్కాలిక సంధిని అందజేస్తోందని సీనియర్ హమాస్ అధికారులు చెప్పారు. ఇక లెబనాన్‌లోని బాల్‌బెక్-హెర్మెల్ ప్రాంతంలో ఇజ్రాయెల్ దాడుల్లో 52 మంది మరణించగా 72 మంది గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: India-Pak Trade Relations: ఈ ఒక్క అంశంలో భారత్‌ పాకిస్థాన్‌పై ఆధారపడుతోంది!