NTV Telugu Site icon

Egypt: ఈజిప్టులో ఘోర రోడ్డు ప్రమాదం.. వాహనాలు ఢీకొని 35 మంది దుర్మరణం

Egypt Accident

Egypt Accident

Egypt: ఈజిప్టులో ఘోర ప్రమాదం జరిగింది. హైవేపై కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో 35 మంది మరణించారు. చాలా మంది గాయపడ్డారు, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వాడీ అల్ నట్రూన్ సమీపంలో కైరో-అలెగ్జాండ్రియా డెజర్ట్ రహదారిపై ఈ ఘటన జరిగింది. ప్రమాద సమయంలో చెలరేగిన మంటల కారణంగా మరణించినవారిలో 18 మంది కాలిబూడిదయ్యారు. 53 మంది గాయపడ్డారు.

Read Also: Suresh Gopi: మహిళా రిపోర్టర్‌పై చేయేసిన మళయాళ స్టార్ హీరో.. చివరకు..

శనివారం ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. హైవేపై మూడు ప్యాసింజర్ బస్సులు, 10 కార్లు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారు నుంచి ఆయిల్ లీక్ అయింది. ఇది మంటలను ఏర్పడటానికి కారణమైంది. ఈ మంటలు తర్వాత వాహనాలకు కూడా వ్యాపించాయి. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే స్థానిక అధికారులు క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Show comments