Site icon NTV Telugu

Thailand: థాయ్‌లాండ్‌లో దారుణం.. డే కేర్ సెంటర్ కాల్పుల్లో 31 మంది మృతి

Thailand

Thailand

At Least 31 Killed In Mass Shooting At Day-Care Centre In Thailand: థాయ్‌లాండ్‌లో ఘోరం జరిగింది. ఓ ఉన్మాది తుపాకీతో కాల్పులు జరిపాడు. డే కేర్ సెంటర్ పై విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 31 మంది మరణించినట్లు థాయ్‌లాండ్‌ పోలీసులు వెల్లడించారు. బాధితుల్లో ఎక్కువగా పిల్లలే ఉన్నారు. పిల్లలు, పెద్దలతో కలిపి 31 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

Read Also: Free Ration: రేష‌న్‌కార్డుదారులకు శుభవార్త.. మరోసారి 10 కిలో ఉచిత బియ్యం పంపిణీ

థాయ్‌లాండ్‌లోని ఈశాన్య ప్రావిన్సులోని పిల్లల డేకేర్ సెంటర్ పై ఉన్మాది గురువారం కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి మాజీ పోలీస్ అధికారిగా పోలీసులు గుర్తించారు. అతని కోసం వేట ప్రారంభించారు. దేశంలోని అన్ని ఏజెన్సీలను అధికారులు అప్రమత్తం చేశారు. ఆగ్నేయాసియాలోని ఇతర దేశాలతో పోలిస్తే.. థాయ్‌లాండ్‌లో తుపాకుల వాడకం రేటు పెరిగింది. అయితే అధికారికంగా తుపాకుల లైసెన్సులు తక్కువగా ఉన్నప్పటికీ..సరిహద్దుల్లోని ఇతర దేశాల ద్వారా కొంతమంతి తుపాకులను కొనుగోలు చేస్తున్నారు.

అయితే థాయ్‌లాండ్‌లో సామూహిక కాల్పులు జరగడం చాలా అరుదు. 2020లో ఆస్తి తగాదాల వల్ల ఓ సైనికులు 29 మందిని చంపి 57 మందిని గాయపరిచాడు. ఆ తరువాత ఇప్పుడే ఇంతపెద్ద మాస్ షూటింగ్ సంఘటన జరిగింది. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవాలని ప్రధాని జనరల్ ప్రయుత్ చాన్ ఓచా అధికారులను ఆదేశించారు.

https://twitter.com/ThaiEnquirer/status/1577929950610731009

Exit mobile version