NTV Telugu Site icon

Mali: మాలిలో దారుణం.. దుండగుల కాల్పుల్లో 26 మంది మృతి..

Mali

Mali

Mali: ఆఫ్రికా దేశమైన మాలిలో బుర్కినాఫసోతో ఉన్న దేశ సరిహద్దుల్లోని డెంబో అనే గ్రామంలో పొలాల్లో పని చేసుకుంటుండగా.. కొంత మంది దుండగులు ఒక్కసారిగా దాడి చేసి దాదాపు 26 మందిని చంపేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ దాడికి ఏ వర్గమూ బాధ్యత వహించలేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో ఇటీవల ఈలాంటి దాడులు మరీ ఎక్కువ అయ్యాయని పేర్కొన్నారు. అయితే, సైన్యం సైతం ఈలాంటి దాడులను నిలువరించలేకపోతోందన్నారు. సాధారణంగా ఇక్కడి గ్రామీణ ప్రజలపై ఉగ్ర సంస్థ అల్‌ ఖైదాకు అనుబంధంగా పని చేసే జేఎన్‌ఐఎం గ్రూప్‌ దాడి చేస్తుంది.. ఈ నెలలోనే ఓ వివాహ వేడుకలో 21 మంది సామాన్య ప్రజలను పొట్టన బెట్టుకుందని అధికారులు చెప్పుకొచ్చారు. తాజా దాడి కూడా వారి పనే అఅయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Mystery of Death: సనత్ నగర్లో ముగ్గురు మృతుల మిస్టరీని ఛేదించిన పోలీసులు

కాగా, మధ్య, ఉత్తర మాలిలో దాదాపు దశాబ్ద కాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఉత్తర ప్రాంతంలోని నగరాల్లో ఒకప్పుడు అధికారంలో ఉన్న తీవ్రవాద ముఠాలను ఫ్రెంచ్ సైన్యం సహాయంతో దేశ భద్రతా బలగాలు తరిమికొట్టాయి. వారందరూ ఒక గ్రూపుగా ఏర్పడి గ్రామాలు, సైనికులపై తరచూ దాడులకు దిగుతున్నారు. ఈ ముఠాను అంతం చేసేందుకు సైనికులు కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహింది.