NTV Telugu Site icon

The Sun: సూర్యుడిపై పొంగిన ప్లాస్మా.. ఏకంగా లక్ష కిలోమీటర్ల ఎత్తు..

Sun

Sun

Plasma Waterfall: సూర్యుడు ప్రస్తుత తన 11 ఏళ్ల ‘‘సోలార్ సైకిల్’’ దశలో ఉన్నాడు. దీంతో సూర్యుడి ఉపరితలంపై కల్లోల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సౌర జ్వాలలు, బ్లాక్ స్పాట్స్ వంటివి ఇటీవల కాలంలో ఏర్పడటం గమనించాం. ప్రతీ 11 ఏళ్లకు ఒకసారి సూర్యుడి ధ్రువాలు మారుతుంటాయి. అంటే దక్షిణ ధ్రువం ఉత్తరంగా, ఉత్తర ధ్రువం దక్షిణంగా మారుతాయి. ఈ కాలంలో సూర్యుడి నుంచి సౌర జ్వాలలు, ప్లాస్మా విస్పోటనాలు విశ్వంలోకి వెలువడుతుంటాయి.

Read Also: Flight Emergency Landing: కోల్‌కతాలో సౌదీ ఎయిర్‌లైన్స్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ఇదిలా ఉంటే తాజాగా అర్జెంటీనాకు చెందిన ఖగోళ శాస్త్రవేత్త ఎడ్వర్డో షాబెర్గర్ పౌపో సూర్యుడి ఉపరితానికి సంబంధించి స్టన్నింగ్ ఫోటోను క్యాప్చర్ చేశాడు. సూర్యుడి ఉపరితలం నుంచి భారీగా ప్లాస్మా ఎగిసిపడింది. మార్చి 9న ఈ ఆస్ట్రోఫోటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని ఫోటో తీశాడు. ప్లాస్మా జలపాతంలా కనిపించే ఈ దృశ్యం అత్యద్భుతంగా ఉంది. సూర్యడి ఉపరితలం నుంచి పొంగిన ప్లాస్మా తిరిగి పడిపోతున్నట్లుగా ఈ ఫోటో చూపిస్తుంది.

దాదాపుగా సూర్యుడి ఉపరితలం నుంచి 62,000 మైళ్ల( 1,00,000 కిలోమీటర్ల) ఎత్తు వరకు ఈ ప్లాస్మా వెలువడం చూడవచ్చు. ఇలాంటివి ఇంతకుముందు కూడా కనిపించాయి. సూర్యుడి ధ్రువాల వద్ద ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిని ‘‘పోలార్ క్రౌన్ ప్రామినెన్స్(పీసీపీ)’’ అని పిలుస్తారు. సూర్యుడి ఉపరితంలోని అయస్కాంత క్షేత్రాల నుంచి ఇవి బయటకు వస్తాయి. Space.com ప్రకారం ఇలా సూర్యుడి నుంచి ఎగిసిపడిన ప్లాస్మా గంటకు 22,370 కిలోమీటర్ల బ్రహ్మాండమైన వేగంతో మళ్లీ వెనక్కి పడిపోయాయి.

Show comments