Covid-19 vaccine: ప్రముఖ పార్మాస్యూటికల్ సంస్థ ఆస్ట్రాజెనెకి తొలిసారిగా తమ కోవిడ్-19 వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని అంగీకరించింది. థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS) అనే దుష్బ్రభావానికి కారణమవుతుందని ఒప్పుకుంది. థ్రాంబోసిస్ రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్‌లెట్స్ కౌంట్‌కి కారణమవుతుంది. తీవ్రమైన గాయాలు, మరణాలకు టీకా కారణమవుతుందని ఆరోపణలతో న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటోంది. తొలిసారిగా ఆస్ట్రాజెనికా కోవిడ్-19 వ్యాక్సిన్ అరుదైన దుష్ప్రభావాలకు దారి తీస్తుందని కోర్టు పత్రాల్లో అంగీకరించింది.
Read Also: Pakistan: చైనీస్ ఇంజనీర్ల హత్య కేసులో ప్రధాన చర్యలు.. నలుగురు అనుమానితుల అరెస్ట్
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కంపెనీ కోవిషీల్డ్, వాక్స్‌జెవ్రియా బ్రాండ్ల పేర్లతో ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సిన్లను విక్రయించింది. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ వినాశకరమైన ప్రభావాలు కలిగి ఉన్నాయని అనేక కుటుంబాలు కోర్టు ఫిర్యాదు ద్వారా ఆరోపించాయి. ఏప్రిల్ 2021లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను తీసుకున్న తర్వాత పర్మినెంట్ బ్రెయిన్ ఇంజూరీతో బాధపడుతున్న జామీ స్కాట్ ఈ న్యాయపోరాటాన్ని ప్రారంభించారు. ఇతని కేసులో రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్‌లెట్ కౌంట్ లక్షణాలు కలిగిన థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS) అనే అరుదైన సైడ్ ఎఫెక్ట్ యొక్క తీవ్రమైన ప్రభావాన్ని హైలెట్ చేయబడింది. యూకే హైకోర్టుకు సమర్పించిన పత్రాల్లో ఆస్త్రాజెనికా టీకా చాలా అరుదైన సందర్భాల్లో TTSకి కారణం కావచ్చని అంగీకరించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై ఈ వ్యాక్సిన్ యూకేలో నిర్వహించబడదు.
