NTV Telugu Site icon

Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకున్న సునీతా విలియమ్స్.. మరో 6 నెలల తర్వాతే భూమి పైకి..

Sunita Williams

Sunita Williams

Sunita Williams: అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతా విలియమ్స్ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్)కి వెళ్లిన సునితా విలియమ్స్ మరో 6 నెలల పాటు అక్కడే ఉండబోతున్నట్లు నాసా చెప్పింది. సునితా విలియమ్స్ జూన్ 5న ఫ్లోరిడా నుంచి స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సూల్‌లో అంతరిక్షంలోకి వెళ్లింది. అయితే, స్టార్‌లైనర్‌లో ప్రొపల్షన్ సిస్టమ్ సమస్యలు ఏర్పడటంతో వారు భూమికి రాలేకపోయారు. స్పేస్ క్యాప్సుల్‌లో లీక్స్ ఏర్పడ్డాయి. థ్రస్టర్లు విఫలమయ్యాయి. అయితే, వీటిని సరి చేసేందుకు నిపుణులు ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేదని తెలుస్తోంది. దీంతో వారి సునితా విలియమ్స్‌తో పాటు మరికొందరి వ్యోమగాముల స్పేష్ మిషన్ కొన్ని నెలల పాటు పొడగించనున్నారు.

ప్రయోగం తర్వాత 8 రోజుల్లోనే భూమిపైకి తిరిగి రావాలని అనుకున్నప్పటికీ స్టార్‌లైనర్ స్పేస్ క్యాప్సుల్‌లో అవాంతరాలతో వారు మరికొన్ని రోజులు ఐఎస్ఎస్‌లోనే గడపనున్నారు. సునితా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ లేకుండానే స్టార్ లైనర్ భూమికి వస్తుందని నాసా శుక్రవారం ప్రకటించింది. ఆరు నెలల పాటు అంటే ఫిబ్రవరి 2025 వరకు వీరిద్దరు అంతరిక్షంలో ఉండబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎలా‌న్ మస్క్‌కి చెందిన ‘‘స్పేస్ ఎక్స్’’ క్రూ-9 వెహికిల్ ద్వారా భూమిపైకి తిరిగి వస్తారు.

Read Also: Mallikarjun Kharge: కేంద్రం తగ్గింది.. “యూపీఎస్ లో ‘యూ’ అంటే మోడీ ప్రభుత్వం యూ-టర్న్”

ఇదిలా ఉంటే స్టార్‌లైనర్‌లో అంతరాయాలు బోయింగ్ సంస్థకు భారీ నష్టాలను మిగిల్చియా. దీని నష్టాలు 1 బిలియన్ డాలర్లకు మించి ఉన్నాయని సీఎన్‌బీసీ నివేదించింది. నాసా వ్యోమగాముల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో రిటర్న్ మిషన్‌ కోసం స్పేస్ ఎక్స్‌కి ప్రాధాన్యత ఇచ్చింది. అయితే, ఖాళీగా స్టార్‌లైనర్‌‌ని భూమికి తిరిగి తీసుకురావడానికి సరైన సమయం కోసం నాసా దాని ఫ్లైట్ రెడీనెస్ రివ్యూకి సంబంధించిన అదనపు దశల్ని నిర్వహిస్తోంది.

అత్యవసర సిబ్బందిని తిరిగి తీసుకురావడానికి స్టార్‌లైనర్ సురక్షితంగా ఉందని బోయింగ్ హామీ ఇచ్చినప్పటికీ, నాసా అంగీకరించలేదు. అయితే, నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ బోయింగ్‌కి మద్దతిచ్చారు. భవిష్యత్తులో స్టార్‌లైనర్ మళ్లీ ప్రారంభించబడుతుతందని తాను 100 శాతం నమ్ముతున్నానని పేర్కొన్నారు. నాసా అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్ కెన్ బోవర్‌సాక్స్ మాట్లాడుతూ, సిబ్బందిని ఇంటికి తీసుకురావడానికి స్పేస్‌ఎక్స్‌ను ఎంచుకునే నిర్ణయంలో నాసా అధికారులు ఏకగ్రీవంగా ఉన్నారని చెప్పారు.

Show comments