NTV Telugu Site icon

Operation Ajay: హమాస్‌-ఇజ్రాయెల్ యుద్ధం.. టెల్‌ అవీవ్‌ నుండి ఢిల్లీకి ఇండియన్స్‌ ..

Untitled 17

Untitled 17

Operation Ajay: అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయిల్ పైన ఆకస్మిక దాడి చేసింది.. ఈ దాడుల్లో వందలాది మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటికి హమాస్ ఇజ్రాయిల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆకస్మికంగా యుద్ధం సంభవించింది. ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుని ఉన్న ఇజ్రాయిల్ లో భారతీయులు చిక్కుకుని ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయిల్ లో చిక్కుకుని ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం ఆపరేషన్‌ అజయ్‌ ను నిర్వహిస్తుంది. ఆపరేషన్‌ అజయ్‌లో భాగంగా కేంద్రం ఆరో విడతలో 143 మంది ప్రయాణికులను తరలించింది. వీరిలో ఇద్దరు నేపాల్ దేశస్థులు కూడా ఉన్నారు. కాగా విమానంలో ఢిల్లీకి చేరిన ప్రయాణికులకు కేంద్ర సహాయశాఖ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే స్వాగతం పలికారు.

Read also:Dasara Jammi Chettu: దసరా రోజు జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారు?

అలానే ప్రయాణికులను విమానం సురక్షితంగా తీసుకు రావడం పైన హర్షం వ్యక్తం చేశారు. ప్రయాణికులు సురక్షితంగా స్వదేశానికి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. కాగా ఇజ్రాయిల్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకు వచ్చేందుకులు ఈ నెల 12వ తేదీన ఆపరేషన్‌ అజయ్‌’ని ప్రారంభించింది ప్రభుత్వం. తొలుత ఐదు ప్రత్యేక విమానాలలో టెల్‌ అవీవ్‌ నుంచి ఢిల్లీకి పిల్లలతో సహా 1200 మందిని తరలించింది. ఇందులో 18 మంది వరకు నేపాలీ పౌరులు సైతం ఉన్నారు. కాగా ఇజ్రాయిల్ లో భారత పౌరులు 18 వేల మంది ఉన్నారు. వీరిలో కొందరు ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు కాగా మరికొందరు నిపుణులు, వజ్రాల వ్యాపారులు కూడా ఉన్నారు.